Beauty Tips

Sugar For Face Glow : కొబ్బ‌రినూనె, చ‌క్కెర‌తో ఇలా చేస్తే.. ఎంత‌టి న‌ల్ల ముఖం అయినా స‌రే తెల్ల‌గా..

Sugar For Face Glow : కొబ్బ‌రినూనె, చ‌క్కెర‌తో ఇలా చేస్తే.. ఎంత‌టి న‌ల్ల ముఖం అయినా స‌రే తెల్ల‌గా.. ముఖం అందంగా కాంతివంతంగా ఉండాలంటే బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి వేల కొద్ది డబ్భును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మన వంటింటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో చాలా తక్కువ ఖర్చులో చాలా సులభంగా ముఖాన్ని మిలమిలా మెరిసేలా చేయవచ్చు. ఇప్పుడు చెప్పే చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఒక బౌల్ లో ఒక స్పూన్ పంచదార, ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ రాగి పిండి వేసి దానిలో కొబ్బరి నూనె వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి వృత్తాకార మోషన్ లో మసాజ్ చేయాలి. బాగా ఆరాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తే ముఖం మీద పెరుకుపోయిన దుమ్ము, ధూళి తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే ముఖం మీద ఉన్న బ్లాక్ హెడ్స్,నల్లని మచ్చలు అన్నీ తొలగిపోతాయి. కాస్త సమయాన్ని కాస్త శ్రద్ద పెడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖాన్ని మిలమిలా మెరిసేలా చేసుకోవచ్చు. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

శనగపిండిలో(besan flour) ఉండే జింక్ ముఖంపై వచ్చే మొటిమలు కారణమయ్యే ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. అలాగే అదనపు జిడ్డు (సెబమ్) ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది. చర్మం మీద నలుపును తగ్గిస్తుంది. చర్మం ప్రకాశవంతంగా మెరవటానికి సహాయపడుతుంది. చర్మం తేమగా ఉండేలా చేస్తుంది.

రాగి పిండి వృద్ధాప్య ఛాయలు ఆలస్యం అయ్యేలా చేస్తుంది. చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది. ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. పంచదారలో ఉన్న లక్షణాలు చర్మం మీద మృతకణాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. అలాగే కొబ్బరి నూనె చర్మం మీద తేమ ఉండేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.