Beauty Tips

White Hair Turn Black:కేవలం కొబ్బరి నూనెతోనే తెల్ల జుట్టును నల్లగా మార్చవచ్చు..ఎలా అంటే…

White Hair Turn Black:కేవలం కొబ్బరి నూనెతోనే తెల్ల జుట్టును నల్లగా మార్చవచ్చు..ఎలా అంటే… తెల్లజుట్టు సమస్య అనేది చిన్న పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తుంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే తెల్ల జుట్టు సమస్య కనిపించేది. కానీ ఇప్పుడు చిన్న వయసులోనే తెల్ల జుట్టు కనపడుతుంది. తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టాలంటే కొబ్బరి నూనె చాలా బాగా సహాయపడుతుంది. కొబ్బరి నూనెను చర్మ సంరక్షణలోనూ, కేశ సంరక్షణలోనూ పురాతన కాలం నుండి వాడుతున్నారు. తెల్ల జుట్టు సమస్యకు కొబ్బరి నూనె ఎలా చెక్ పెడుతుందో ఇప్పుడు చూద్దాం.

కొబ్బరి నూనెలో గోరింటాకు కలిపి రాసుకుంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. మూడు స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక స్పూన్ గోరింటాకు పొడి వేసి పొయ్యి మీద పెట్టి సన్నని మంట మీద ఉడికించాలి. ఆ తర్వాత వడగట్టి ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి. గంట తరువాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే జుట్టు మూలాల నుండి నల్లగా మారుతుంది.

కొబ్బరి నూనె, నిమ్మరసం కూడా తెల్ల జుట్టు సమస్యను తొలగించడానికి సహాయపడుతుంది. మూడు స్పూన్ల కొబ్బరి నూనెను వేడి చేసి దానిలో మూడు స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి మసాజ్ చేయాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే తెల్ల జుట్టు సమస్య తొలగిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.