Beauty Tips

Cracked Heels:పాదాల పగుళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా…ముఖ్యంగా ఈ సీజన్ లో…

Cracked Heels:పాదాల పగుళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా…ముఖ్యంగా ఈ సీజన్ లో…ఈ సీజన్ లో పాదాల పగుళ్ళు అనేవి సాదారణంగా వస్తూ ఉంటాయి. పాదాలకు ఎంత సంరక్షణ చేసిన పాదాల పగుళ్ళ సమస్య వస్తుంది. పాదాల పగుళ్లు అనేవి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాదాల పగుళ్లు ఎక్కువగా ఉంటే చూడటానికి అసహ్యంగా ఉండటమే కాకుండా పగుళ్ళ మధ్య దుమ్ము,ధూళి పెరుకుపోయి సమస్య ఎక్కువ అవుతుంది.

సమస్య చిన్నగా ఉన్నప్పుడే తగ్గించుకొనే ప్రయత్నాలు చేయాలి. మార్కెట్ లో దొరికే క్రీమ్స్ కన్నా ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సులభంగా చాలా తక్కువ ఖర్చుతో పాదాల పగుళ్ళ సమస్య నుండి బయట పడవచ్చు.

గుప్పెడు తులసి ఆకులను తీసుకోని శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ లో ఒక కర్పూరం బిళ్ళను పొడిగా చేసి వేయాలి. ఆ తర్వాత పావు స్పూన్ లో సగం పసుపు,ఒక స్పూన్ అలోవేర జెల్ వేసి బాగా కలిపి పాదాల పగుళ్ళు ఉన్న ప్రదేశంలో రాసి పది నిమిషాలు అయ్యాక శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా రోజు చేస్తూ ఉంటె పాదాల పగుళ్ళు క్రమంగా తగ్గిపోతాయి. తులసి,పసుపు,కర్పూరం,అలోవేర జెల్ లో ఉన్న లక్షణాలు పాదాల పగుళ్ళ సమస్యను తగ్గించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ చిట్కాలో వాడిన అన్ని ఇంగ్రిడియన్స్ ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.