Beauty Tips

Face Glow Tips:పసుపు,పెరుగు,శనగపిండితో ఇలా చేస్తే​.. మొటిమలు, ముడతలకు చెక్!

Turmeric and curd Face Tips:పసుపు,పెరుగు,శనగపిండితో ఇలా చేస్తే​.. మొటిమలు, ముడతలకు చెక్.. ముఖం అందంగా కాంతివంతంగా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం వేల కొద్దీ డబ్భును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటిలోనే సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా తక్కువ ఖర్చులో చాలా సులభంగా ముఖం మొటిమలు,ముడతలు లేకుండా చూసుకోవచ్చు.

ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి, పావు స్పూన్ లో సగం పసుపు, స్పూన్ పెరుగు, ఒక స్పూన్ నీరు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 5 నిమిషాల తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే ముఖం మీద మొటిమలు,జిడ్డు అన్నీ తొలగిపోతాయి.

పసుపులో ఉండే గుణాలు చర్మానికి చాలా మేలును చేస్తాయి. పసుపులో యాంటీ ఇనఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి మడతలు, మచ్చలను తొలగించి చర్మం డ్యామేజ్ కాకుండా కాపాడతాయి. పసుపులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు చర్మంపై ఏర్పడే బ్యాక్టీరియాను నాశనం చేసి చర్మ సంరక్షణలో సహాయపడతాయి.

శనగపిండిని పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో వాడుతున్నారు. చర్మం మీద దుమ్ము,దులి,మురికి,జిడ్డును తొలగించటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చర్మం మీద మృత కణాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. శనగపిండి జిడ్డు చర్మం ఉన్నవారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చర్మంపై అదనంగా ఉన్న నూనెను తొలగిస్తుంది.

పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అలాగే చనిపోయిన మృత కణాలను తొలగించి చర్మం ప్రకాశవంతంగా మెరవటానికి సహాయపడుతుంది. చర్మం మీద మచ్చలు,ముడతలు రాకుండా కాపాడుతుంది. కాబట్టి ఈ ప్యాక్ వేసుకొని మొటిమలు, ముడతలకు చెక్ పెట్టండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.