Beauty Tips

Lip Care Tips:తేనెతో ఇలా చేస్తే చాలు నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారటం ఖాయం

Lip Care Tips:తేనెతో ఇలా చేస్తే చాలు నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారటం ఖాయం.. సీజన్ మారటంతో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పెదాలు పొట్టు రాలిపోయి నిర్జీవంగా మారటమే కాకుండా నల్లగా మారిపోతాయి. నల్లగా మారిన పెదాలు గులాబీ రంగులోకి మారటానికి ఇప్పుడు చెప్పే చిట్కా బాగా పనిచేస్తుంది.

చాలా మందికి పెదాలు నల్లగా మారి పొట్టు రాలుతూ ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో జీవం కోల్పోయి పెదాలు పగిలి నల్లగా మారి ఒక్కోసారి పెదాల నుండి నొప్పి, రక్తం కూడా వస్తూ ఉంటాయి. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎక్కువగా నీటిని తాగాలి. అలాగే ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే కావలసిన తేమ అంది పెదాలు గులాబీ రంగులోకి మారతాయి.

ఫిగ్మెంటేషన్ తొలగిపోయి గులాబీ రంగులోకి మారతాయి. ఒక బౌల్ లో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక స్పూన్ పంచదార లేదా బ్రౌన్ షుగర్, ఒక స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఈ మూడింటిని బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ బాక్స్ లో నిల్వ చేసుకోవచ్చు. ఫ్రిజ్ లో పెడితే మూడు నెలల వరకూ నిల్వ ఉంటుంది.

ఆలివ్ ఆయిల్ లేకపోతే బాదం నూనె లేదా కొబ్బరి నూనె వాడవచ్చు. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసి సున్నితంగా మసాజ్ చేసి పది నిమిషాలు అయ్యాక శుభ్రంగా కడగాలి. ఈ విధంగా రోజు చేస్తూ ఉంటే నల్లని పెదాలు క్రమంగా గులాబీ రంగులోకి మారతాయి. పెదాల మీద ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. అలాగే పెదాలు తేమగా ఉంటాయి. ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.

నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారటానికి ఎటువంటి క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. కాకపోతే కాస్త ఓపిక,సమయం ఉండాలి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నల్లని పెదాలను గులాబీ రంగులోకి మార్చుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.