Beauty Tips

Curd And Besan For Face:పెరుగులో కలిపి రాస్తే ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మెరుస్తుంది

Curd And Besan For Face:పెరుగులో కలిపి రాస్తే ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మెరుస్తుంది.. పెరుగులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అలాగే ఎన్నో ఆరోగ్య, బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పెరుగుని ఉపయోగించి మనం ముఖం తెల్లగా కాంతివంతంగా చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ అందం మీద శ్రద్ధ పెడుతున్నారు. అలాగే దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఎంత ఖర్చు పెట్టడానికి అయినా సిద్ధంగా ఉంటున్నారు.

మన ఇంటిలో దొరికే సహజ సిద్ధమైన పదార్థాలతో చాలా సులభంగా ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. పెరుగులో మంచి బ్యాక్టీరియా, కొవ్వు ఆమ్లాలు మరియు లాక్టిక్ యాసిడ్‌ ఉండుట వలన చర్మ సంరక్షణలో సహాయపడుతుంది. మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది.

పెరుగులో ఉండే ముఖ్యమైన కొవ్వులు, ప్రొటీన్లు, విటమిన్లు మరియు మినరల్స్ చర్మానికి అవసరమైన పోషణను అందించి చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది మరియు చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది.

పెరుగులోని ఎక్స్‌ఫోలియేటింగ్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు రంధ్రాలను అన్‌లాగ్ చేయడంలో సహాయపడి మొటిమలకు కారణం అయినా బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పని చేస్తాయి.చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి, రెండు స్పూన్ల పెరుగు వేసి బాగా కలిపి ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే చర్మాన్ని శుభ్రం చేసి చర్మం మీద మృత కణాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.