Beauty Tips

White hair Turn Black:కొబ్బరి నూనెలో కలిపి రాస్తే తెల్ల జుట్టు 7 రోజుల్లో నల్లగా మారడం ఖాయం!

White hair Turn Black:కొబ్బరి నూనెలో కలిపి రాస్తే తెల్ల జుట్టు 7 రోజుల్లో నల్లగా మారడం ఖాయం.. తెల్లజుట్టు సమస్య ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. మారిన జీవనశైలి పరిస్థితి, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య వస్తుంది. దాంతో కంగారు పడి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు.

అలా కాకుండా ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని పదార్ధాలను వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా తక్కువ ఖర్చుతో తెల్లజుట్టు సమస్య నుండి బయట పడవచ్చు. తెల్లజుట్టును నల్లగా మార్చటంలో కొబ్బరి నూనె, సోంపు మిశ్రమం చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

సోంపును మనం రెగ్యులర్ గా వాడుతూనే ఉంటాం. సోంపులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం మనలో చాలా మందికి తెలుసు. అయితే బ్యూటీ ప్రయోజనాలు ఉన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. ఈ నూనెను తయారుచేసుకొని నిల్వ చేసుకోవచ్చు.

ముందుగా సోంపును మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక కప్పు కొబ్బరి నూనె పోసి కాస్త వేడి అయ్యాక రెండు స్పూన్ల సోంపు పొడి వేసి బాగా మరిగించాలి. ఈ నూనె చల్లారక వడకట్టి నిల్వ చేసుకోవాలి.

ఈ నూనెను ప్రతి రోజు రాసుకుంటూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. సోంపులో ఉన్న లక్షణాలు తెల్లజుట్టును నల్లగా మార్చటంలో చాలా బాగా సహాయపడతాయి. కొబ్బరి నూనె కూడా తెల్లజుట్టును నల్లగా మార్చటంలో సహాయపడుతుంది.

సోంపును ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఈ చిట్కాలను ఫాలో అవ్వటం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి మరియు చుండ్రు సమస్య తగ్గటానికి కూడా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.