Beauty Tips

Hair Care Tips:7 రోజుల్లో ఎంత పలుచగా ఉన్న జుట్టు అయినా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది

Hair Care Tips:7 రోజుల్లో ఎంత పలుచగా ఉన్న జుట్టు అయినా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.. జుట్టుకి సంబందించిన సమస్యలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. ఈ సమస్యలను ఇంటి చిట్కాల ద్వారా చాలా సమర్ధవంతంగా తగ్గించుకోవచ్చు. కాస్త ఓపికగా చేసుకుంటే ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. మన ఇంటిలో ఉంటే వస్తువులను ఉపయోగిస్తే సరిపోతుంది.

ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్ల కారణంగా జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువైంది. ఈ సమస్యను తగ్గించుకోవటానికి మార్కెట్లో రకరకాల ప్రొడక్ట్స్ లభ్యం అవుతాయి. కానీ వాటిని వాడటం వలన వాటిలో ఉండే కెమికల్స్ కారణంగా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. .

కాబట్టి ఈ సమస్యను తగ్గించుకోవడానికి మన ఇంటిలోనే ఒక నూనెను తయారు చేసుకోవచ్చు. ఒక బౌల్ లో రెండు విటమిన్ E క్యాప్సిల్స్ లోని ఆయిల్ వేయాలి. జుట్టు ఒత్తుగా పొడవుగా ఉంటే నాలుగు క్యాప్సిల్స్., మీడియం జుట్టు అయితే రెండు క్యాప్సిల్స్ సరిపోతాయి. ఆ తర్వాత ఒక స్పూన్ ఆముదం వేయాలి.

ఆ తర్వాత ఒక స్పూన్ బాదం నూనె వేయాలి. ఈ మూడు నూనెలు బాగా కలిసేలాగా కలుపుకొని ఈ నూనెను జుట్టుకు బాగా పట్టించాలి. ఒక గంట తర్వాత కుంకుడు కాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితం కనబడుతుంది. విటమిన్ E ఆయిల్ జుట్టు రాలే సమస్యను తగ్గించి కొత్త జుట్టు రావడానికి సహాయపడుతుంది.

ఇక ఆముదం విషయానికి వస్తే పూర్వకాలం నుండి ఆముదంను జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. జుట్టు నల్లగా .నిగనిగలాడుతూ ఒత్తుగా పెరగటానికి ఆముదం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బాదం నూనెలో ఉన్న .పోషకాలు జుట్టుకు అవసరమైన పోషణను అందించి జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఈ రెమిడిలో ఉపయోగించిన మూడు ఇంగ్రిడియన్స్ మనకు సులువుగానే అందుబాటులో ఉంటాయి. అలాగే జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే జుట్టు రాలే సమస్యను చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.