Beauty Tips

Hair Tips:గుమ్మడి గింజలు జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి

Hair Tips:గుమ్మడి గింజలు జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.. ఈ మధ్యకాలంలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. జుట్టు రాలే సమస్యకు గుమ్మడి గింజల నూనె చాలా బాగా సహాయపడుతుంది.

గుమ్మడి గింజల్లో విటమిన్ ఏ, బి, సి, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్ వంటి అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఈ గింజలలో ఉండే జింక్ జుట్టు పెరుగుదలలో అలాగే దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేయడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.

ఆహారంలో గుమ్మడి గింజలను తీసుకుంటూ జుట్టుకు గుమ్మడి గింజలను నూనెను రాస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. గుమ్మడి గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు కుడుళ్ళను బలోపేతం చేయటానికి మరియు జుట్టు నిర్మాణాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

అంతేకాకుండా స్కాల్ప్‌ పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది. గుమ్మడి గింజల నూనె జుట్టు చివర్లు చీట్టిపోయే అవకాశాలను తగ్గిస్తుంది. గుమ్మడికాయ గింజలలో ఉండే విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి నుండి జుట్టును రక్షిస్తాయి.

గుమ్మడి గింజలను తింటూ ఇప్పుడు చెప్పే ప్యాక్ జుట్టుకి వేస్తే మంచి పలితం ఉంటుంది. అరకప్పు గుమ్మడి గింజలలో అరకప్పు పెరుగు వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ లో రెండు స్పూన్ల కొబ్బరి నూనె, ఒక స్పూన్ తేనే వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.