Healthhealth tips in telugu

Thati Bellam:భోజనం చేసిన తర్వాత చిన్న ముక్క తింటే ఎన్నో ప్రయోజనాలు…

Thati Bellam:భోజనం చేసిన తర్వాత చిన్న ముక్క తింటే ఎన్నో ప్రయోజనాలు… తాటి బెల్లం అనేది తెల్లని పంచదారకు ఒక మంచి ప్రత్యామ్నాయం. పంచదారతో పోలిస్తే తాటి బెల్లంలో ఎన్నో పోషకాలు ఉన్నాయి.

పంచదార పోసేస్ సమయంలో ఫైటోన్యూట్రియెంట్లు ని కోల్పోతుంది. అందువల్ల పంచదారను పోషకాలు లేని స్వీటెనర్ గాచెప్పవచ్చు. తాటి బెల్లం ఎటువంటి రసాయనాలు లేదా కృత్రిమ పదార్థాలు లేకుండా ప్రాసెస్చేయబడుతుంది. కాబట్టి, ఇది ఆరోగ్యకరమైన మరియు సహజమైన స్వీటెనర్ అని చెప్పవచ్చు.

మాములు బెల్లంతో పోలిస్తే తాటి బెల్లంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎంత ధర ఉన్నా కొనటానికి వెనకడుగు వేయరు. మాములు బెల్లంతో పోలిస్తే తాటి బెల్లం రెట్టింపు ధర ఉంటుంది. తాటి బెల్లంలో తేమ 8.61 శాతం, సుక్రోజు, రెడ్యూసింగ్ చక్కెర, కొవ్వు , మాంసకృత్తులు, కాల్షియం, ఫాస్ఫరస్ , ఖనిజ లవణాలు, ఇనుము ఉంటాయి. పోషక విలువలు సమృద్ధిగా ఉండటం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ తాటి బెల్లం చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.

తాటి చెట్టు సారం నుండి తయారవుతుంది. తాటి బెల్లంలో మినరల్స్,విటమిన్స్ సమృద్ధిగా ఉన్నా చాలా మంది తాటి బెల్లం రూపాన్ని చూసి ఇష్టపడరు. కానీ తాటి బెల్లంలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తప్పనిసరిగా తాటి బెల్లం మీద ఇష్టాన్ని పెంచుకుంటారు. తాటి బెల్లంలో పంచదార కంటే 60 రేట్ల విటమిన్స్,మినరల్స్ ఉంటాయి. తాటి బెల్లం జీర్ణక్రియలో బాగా సహాయాపడుతుంది. అందువల్ల చాలా ప్రాంతాల్లో భోజనం అయ్యాక చిన్న తాటి బెల్లం ముక్కను తింటారు.

తాటి బెల్లం జీర్ణ ఎంజైమ్‌లను ప్రోత్సహించటమే కాకుండా పేగు మార్గాలను శుభ్రపరచడానికి సహాయపడుతుంది. తాటి బెల్లంలో ఐరన్ సమృద్ధిగా ఉండుట వలన ప్రతి రోజు రెగ్యులర్ గా తీసుకుంటే శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరిగి రక్తహీనత సమస్య నుండి బయట పడేస్తుంది. మెగ్నీషియం నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. యాంటీఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాల నుండి శరీర కణాలను రక్షించడానికి సహాయపడతాయి.

తాటి బెల్లంలో కాల్షియం, పొటాషియం మరియు పాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి. తాటి బెల్లంలో మిశ్రమ కార్బోహైడ్రేట్లు ఉండుట వలన ఎక్కువ శక్తిని విడుదల చేస్తుంది. అందుకే తాటి బెల్లం తింటే ఎక్కువసేపు ఎనర్జీగా ఉంటాం. తాటి బెల్లం శ్వాస మార్గము, ప్రేగులు, ఆహార పైపు, ఊపిరితిత్తులు మరియు కడుపును శుభ్రపరచి శరీరం నుండి విషాలను తొలగించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

తాటి బెల్లంలో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన ప్రేగు కదలికలను ఉత్తేజపరిచి జీర్ణ ప్రక్రియలో సహాయపడుతుంది. దాంతో మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి. తాటి బెల్లంను పురాతన కాలం నుండి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. దగ్గు,జలుబు తగ్గించటమే కాకుండా ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలను కూడా సమర్ధవంతంగా తగ్గిస్తుంది.

మైగ్రైన్ తలనొప్పి వచ్చిందంటే భరించటం చాలా కష్టం. మైగ్రైన్ తలనొప్పి వచ్చినప్పుడు ఒక స్పూన్ తాటి బెల్లం తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. తాటి బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. తాటి బెల్లంను లిమిట్ గా తీసుకుంటేనే ఈ ఆరోగ్య ప్రయోజనాలు అన్ని పొందవచ్చు. అయితే ఎక్కువగా తీసుకుంటే కూని సైడ్ ఎఫక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లిమిట్ గా తీస్కోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.