Healthhealth tips in telugu

Palm Oil Benefits:వంటల్లో పామాయిల్ వాడుతున్నారా…ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు…

palm Oil Benefits:వంటల్లో పామాయిల్ వాడుతున్నారా…ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు…మనం ప్రతి రోజు వంటలలో సన్ ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్,నువ్వుల నూనె,వేరుశనగ నూనె, పామాయిల్ వంటి వాటిని వాడుతూ ఉంటాం. అయితే వంటలలో Palm Oil ని ఎక్కువగా వాడితే కొన్ని సమస్యలు వస్తాయి. అలాగే కొన్ని సమస్యలు ఉన్నవారు వాడకూడదు.
palm Oil
ఈ నూనెలో బీటా కెరోటిన్, విటమిన్ ఇ మరియు సంతృప్త & అసంతృప్త కొవ్వులు ఉంటాయి. అలాగే ఆల్ఫా,బీటా మరియు గామా-కెరోటిన్‌లు, నీటిలో కరిగే యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫ్లేవనాయిడ్‌ లు సమృద్దిగా ఉంటాయి. కొన్ని సమస్యలు ఉన్నవారు Palm Oil కి దూరంగా ఉంటేనే మంచిది. మెదడు ఆరోగ్యానికి సహాయపడుతుంది.

ఈ నూనెను హోట‌ల్స్‌లో‌, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్స్‌లో ఎక్కువగా వాడతారు. Palm Oil లో అన్ సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండుట వలన గుండెకు సంబందించిన సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి. గుండె సమస్యలు ఉన్నవారు వాడితే ప్రమాదం పెరుగుతుంది.చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. రక్తపోటు సమస్య ఉన్నవారిలో రక్తపోటు పెరుగుతుంది.
Weight Loss tips in telugu
అలాగే అధిక బరువుతో బాధపడుతున్నవారు కూడా దూరంగా ఉంటేనే మంచిది. Palm Oil లో కేలరీలు ఎక్కువగా ఉండుట వలన బరువు పెరుగుతారు. Palm Oil వాడటం వలన ఆకలి పెరుగుతుంది. దాంతో ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవటం వలన బరువు పెరిగే అవకాశం ఉంది. అలాగే అలర్జీ సమస్యలు ఉన్నవారిలో ఆ సమస్య తీవ్రత పెరిగే అవకాశం ఉంది.
Diabetes In Telugu
ఈ నూనెను వాడటం వలన చాలా చిన్న వయస్సులోనే డయాబెటిస్ అనేది వస్తుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా ఈ నూనెను వాడకూడదు. Palm Oil లో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండుట వలన సాధ్యమైనంత వరకు ఈ నూనెను వాడకుండా ఉంటేనే మంచిది. చాలా మంది తక్కువ ధరకు వస్తుందని వాడుతూ ఉంటారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.