Beauty Tips

Hair Fall Tips:వంటింటిలో దొరికే ఈ గింజలతో జుట్టు రాలడాన్ని తగ్గించొచ్చు!

Hair Fall Tips:వంటింటిలో దొరికే ఈ గింజలతో జుట్టు రాలడాన్ని తగ్గించొచ్చు.. జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గించటానికి మన వంటింటిలో ఉండే ధనియాలు చాలా బాగా సహాయపడతాయి. ధనియాలలో ఉండే పోషకాలు జుట్టు సమస్యలను తగ్గించటమే కాకుండా జుట్టు ఎదిగేలా చేస్తుంది.

జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మనలో చాలా మంది కంగారు పడిపోయి మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. ఇలా వాడటం వలన తాత్కాలికంగా ఫలితం ఉన్నా..కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు రాలే సమస్య నుండి బయట పడవచ్చు.

జుట్టు సంరక్షణలో ధనియాలు చాలా బాగా పనిచేస్తాయి. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. ధనియాలలో కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయని అనుకుంటారు. ఒక బౌల్ లో మూడు స్పూన్ల ధనియాలను వేసి నీటిని పోసి మూడు గంటల పాటు నానబెట్టాలి. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి నానబెట్టిన ధనియాలను నీటితో సహ వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి.

ఇలా మరిగించటం వలన ధనియాలు బాగా ఉడుకుతాయి. ఉడికిన ధనియాలను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ఒక బౌల్ లోకి తీసుకొని దానిలో ఒక స్పూన్ ఆలోవెరా జెల్,ఒక స్పూన్ పెరుగు,ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించాలి.

ఒక గంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గటమే కాకుండా చుండ్రు వంటి జుట్టుకి సంబందించిన సమస్యలు ఏమి ఉండవు. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.