Kitchenvantalu

Aloo Tikki Chat :రెగ్యులర్ స్నాక్స్‌తో బోర్ కొట్టిందా.. ఈజీగా ‘ఆలూ టిక్కి చాట్’ చేయండి

Aloo Tikki Chat :రెగ్యులర్ స్నాక్స్‌తో బోర్ కొట్టిందా.. ఈజీగా ‘ఆలూ టిక్కి చాట్’ చేయండి.. బంగాళదుంప అంటే చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరికి ఇష్టమే. బంగాళదుంపతో కూర,వేపుడు,మసాలా కర్రీ వంటి వాటిని చేసుకుంటూ ఉంటాం. లేదంటే బంగాళదుంపతో సమోసా వంటి వాటిని కూడా చేసుకుంటాం. అలా కాకుండా ఇప్పుడు చేసే వైరైటి ALoo Tikka Chat చాలా రుచిగా బాగుంటుంది. దీనికి కావలసిన పదార్ధాలు,తయారి విధానం తెలుసుకుందాం.

Aloo Tikki Chat కి కావలసిన పదార్ధాలు:
ఉడికించిన బంగాళదుంపలు – 2, పసుపు – పావు స్పూన్, కారం అరస్పూన్, మొక్కజొన్న పిండి – 2 స్పూన్స్, గరం మసాలా – అరస్పూన్, ఆమ్‌చూర్ – అరస్పూన్, నూనె – 4 స్పూన్స్, రుచికి సరిపడా ఉప్పు, చాట్ మసాలా – అరస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అరస్పూన్

చాట్ కోసం:
పెరుగు – 2 స్పూన్స్, కారం – చిటికెడు, చింతపండు చెట్నీ – 1 స్పూన్, గ్రీన్ చెట్నీ – 1 స్పూన్, ఉప్పు – చిటికెడు, ఉల్లిపాయ ముక్కలు – 1 స్పూన్, టమోటా ముక్కలు – 1 స్పూన్, జీలకర్ర పొడి – చిటికెడు, చాట్ మసాలా – చిటికెడు, కొత్తిమీర, సన్నని కారప్పూస

Aloo Tikki Chat తయారి విధానం
ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంపను మెత్తగా చేసి వేయాలి. ఆ తర్వాత దానిలో గరం మసాలా, పసుపు, కారం, ఆమ్చూర్, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మొక్కజొన్న పిండి వేసి అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా తయారుచేసి ఒక్కొక్క ఉండను టిక్కీ మాదిరిగా తయారు చేసుకోవాలి. వీటిని నాన్ స్టిక్ పాన్ మీద నూనె వేసి కాల్చి పక్కన పెట్టుకోవాలి.

వీటిని ఒక ప్లేట్లో ఉంచి వాటిపైన పెరుగు, గ్రీన్ చట్నీ, చింతపండు చట్నీ, కారం, ఉప్పు వెయ్యాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాట ముక్కలు కూడా వేయాలి. చివరగా జీలకర్ర పొడి, చాట్ మసాలా,కొత్తిమీర వేయాలి. అంతే ఎంతో రుచికరమైన Aloo Tikki Chat రెడీ…