Beauty Tips

Hair Care Tips:తలలో దురద,చుండ్రు,జుట్టు రాలే సమస్యలకు చెక్ పెట్టండి

Hair Care Tips:తలలో దురద,చుండ్రు,జుట్టు రాలే సమస్యలకు చెక్ పెట్టండి.. రిన జీవనశైలి మరియు మారిన పరిస్థితి, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో జుట్టుకి సంబందించిన సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఈ సమస్యలు రాగానే మనలో చాలా మంది మార్కెట్ లో దొరికే ఖరీదైన ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు.

అయినా పెద్దగా పలితం ఉండదు. దాంతో చాలా నిరాశకు గురి అవుతూ ఉంటారు. అలా నిరాశకు గురి కావలసిన అవసరం లేదు. తలలో దురద,చుండ్రు,జుట్టు రాలే సమస్య వంటి వాటిని తగ్గించుకోవటానికి ఖరీదైన నూనెలు,క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు.

మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు. దీని కోసం కేవలం మూడు ఇంగ్రిడియన్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం.
దీని కోసం ఒక బౌల్ లో రెండు స్పూన్ల పెరుగు, ఒక స్పూన్ శీకాయ పొడి, ఒక స్పూన్ ఆలోవెరా జెల్ వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్లు,మాడు నుంచి కుదుళ్ల వరకు బాగా పట్టించాలి.

అరగంట అయ్యాక రెగ్యులర్ గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే తలలో దురద,చుండ్రు, జుట్టు రాలే సమస్య తగ్గుతాయి. పెరుగు తల మీద ఎటువంటి ఇన్ ఫెక్షన్ రాకుండా చేస్తుంది. శీకాయ జుట్టు రాలటం, చుండ్రు సమస్యను తగ్గించటమే కాకుండా జుట్టు మృదువుగా కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.

ఆలోవెరా మాడు మీద ఇన్ ఫెక్షన్ తగ్గిస్తుంది. చుండ్రు సమస్య,జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి పలితాన్ని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.