Beauty Tips

White Hair Turn Black: రాత్రి సమయంలో ఇలా చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది..

White Hair Turn Black: రాత్రి సమయంలో ఇలా చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.. ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి,ఒత్తిడి, జుట్టుకి సరైన పోషణ లేకపోవటం వంటి అనేక రకాల కారణాలతో తెల్లజుట్టు సమస్య చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. ఇలా రావటంతో చాలా కంగారు పడి మార్కెట్ లో దొరికే కొన్ని ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు.

అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అలాగే జుట్టు రాలే సమస్య మరియు చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది. కాస్త ఓపికగా చేసుకుంటే సరిపోతుంది.

ఒక చిన్న ఉల్లిపాయను శుభ్రంగా కడిగి తొక్క తీయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మిక్సీ జార్ లో ఉల్లిపాయ ముక్కలు, 6 తొక్క తీయని వెల్లుల్లి రెబ్బలు, 4 మందార ఆకులు, గుప్పెడు కరివేపాకు ఆకులు, ఒక కప్పు నీటిని వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట అయ్యాక కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి.

లేదంటే రాత్రి సమయంలో పట్టించి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయవచ్చు. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య తగ్గటమే కాకుండా తెల్లజుట్టు నల్లగా కూడా మారుతుంది. నిస్తేజంగా మారిన జుట్టు కాంతివంతంగా మెరుస్తుంది. ఈ రెమిడిలో ఉపయోగించిన అన్నీ ఇంగ్రీడియన్స్ లో ఉన్న లక్షణాలు జుట్టు కి సంబందించిన అన్నీ రకాల సమస్యలను తగ్గిస్తుంది.

మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడటం వలన వాటిలో ఉండే రసాయనాల కారణంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సహజసిద్దమైన పదార్ధాలతో ఇలా ఇంటి చిట్కాలను పాటిస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. కాబట్టి ఈ చిట్కాను పాటించి జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.