Devotional

Palmistry:మీ చేతి వేళ్లే మీరెలాంటి వారో చెప్పేస్తాయట…ఎలాగో తెలుసుకుందామా..

Palmistry and finger size meaning :మన చేతివేళ్ళ సైజును బట్టి మన వ్యక్తిత్వం, ఆలోచనలు, లక్షణాలు ఎటువంటివి? అనే విషయాలను చాలా క్లియర్ గా తెలుసుకోవచ్చు. చేతివేళ్ళలో మధ్యవేలు, చూపుడువేలు, ఉంగరపు వేలును బట్టి కొందరిపై అధ్యయనం చేసిన తర్వాత ఈ విషయాల గురించి తెలిపారు. ఈ ఆసక్తికర విషయాలను మీకు తెలుసుకోవాలనుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే చదవడం మొదలుపెట్టండి.

A: చూపుడువేలు కన్నా ఉంగరపు వేలు పెద్దదిగా ఉన్నట్లయితే:
1. చూడటానికి చాలా అందంగా ఉంటారు మరియు మనోహరమైన వ్యక్తులు.
2. సమస్యాత్మక నిర్ణయాలు తీసుకుంటారు, వీరికి కాస్త దూకుడు ఎక్కువ.
3. ఇంజినీరింగ్, ఆర్మీ, చెస్ రంగాలను ఇష్టపడతారు.
4. తమ సమస్యను తామే పరిష్కరించుకోగలరు.
5. డబ్బు, ఆస్తి ఎక్కువగా సంపాదిస్తారట.

B: ఉంగరపు వేలు కన్నా చూపుడు వేలు పెద్దదిగా ఉన్నట్లయితే:
1. ఆత్మవిశ్వాసం ఎక్కువ.
2. ఎక్కువగా ఒంటరిగా ఏకాంతంగా ఉంఆ డటానికి ఇష్టపడతారు.
3. ఎవరైనా చిరాకు తెప్పిస్తే వెంటనే కోపగించుకుంటారు.
4. కొత్తవారితో ఎక్కువగా మాట్లాడలేరు, అయితే వారిని జాగ్రత్తగా ఇష్టంగా చూసుకుంటారు.

C: ఉంగరం వేలు, చూపుడు వేలు రెండూ సమానంగా ఉన్నట్లయితే:
1. ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా, ప్రేమగా ఉంటారు.
2. అందరినీ కలుపుకుపోతూ ఉంటారు. అందరితో కలిసి ఉండటమే ఎంతో ఇష్టం.
3. ఎవరినైనా సరే వెంటనే నమ్మేయడం, వారితో స్నేహం చేయడం చేస్తారు.
4. తమ అనుకున్న వారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు.

సో, ఇదండీ ఉంగరపు వేలు, చూపుడువేలు ద్వారా మనిషి వ్యక్తిత్వం గురించి తెలుసుకోవడం. మీరూ ఒకసారి మీ చేతివేళ్ళను చూడండి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."