Beauty Tips

Hair Fall tips:జుట్టు ఎంత పల్చగా ఉన్నా సరే ఇలా చేస్తే వారంలో రెట్టింపు అవుతుంది

Hair Fall tips:జుట్టు ఎంత పల్చగా ఉన్నా సరే ఇలా చేస్తే వారంలో రెట్టింపు అవుతుంది.. జుట్టుకి సంబంధించి సమస్యలు వచ్చినప్పుడు మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో ఉండే కొన్ని సహజసిద్దమైన పదార్ధాలతో చాలా సులభంగా జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గించుకోవచ్చు.

మారిన వాతావరణ పరిస్థితులు, వాతావరణంలో ఉన్న కాలుష్యం, మనం తీసుకునే ఆహారం, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో చాలా చిన్న వయసులోనే జుట్టు రాలే సమస్య ప్రారంభం అవుతుంది. మనలో చాలామంది జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల నూనెలను వాడేస్తూ ఉంటారు. .

అయితే ఆ నూనెలలో కొంచెం కెమికల్స్ ఉండటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మనం ఇంటిలో సహజసిద్ధంగా నూనెను తయారు చేసుకుని వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు రాలకుండా చుండ్రు సమస్య లేకుండా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.

పొయ్యి మీద ఒక పాన్ పెట్టి రెండు స్పూన్ల ఎండు ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల కలోంజీ విత్తనాలు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు కొబ్బరి నూనె వేసి ఉసిరికాయ ముక్కలు రంగు మారే వరకు మరిగించాలి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి నూనె చల్లారాక వడగట్టి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. .

ఈ నూనె దాదాపుగా నెల రోజులు పాటు నిల్వ ఉంటుంది. ఈ నూనెను మామూలుగా కొబ్బరి నూనె రాసుకునే విధంగానే ప్రతిరోజు రాసుకుంటే జుట్టు కుదుళ్లకు మంచి పోషణ అంది జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. జుట్టుకు నూనె రాసినప్పుడు ఐదు నిమిషాలు మృదువుగా మసాజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. .

ప్రతి రోజు రాసుకోవడం కుదరని వారు వారంలో రెండు సార్లు జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు నూనెను పట్టించి ఐదు నిమిషాల సున్నితంగా మసాజ్ చేసి ఒక అరగంట అయ్యాక కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

తాజా ఉసిరికాయ ముక్కలను కూడా వేసుకోవచ్చు. అయితే సీజన్ కానప్పుడు ఎండు ఉసిరి ముక్కలను వేసుకోవచ్చు. ఎండు ఉసిరి ముక్కలు ఆయుర్వేదం షాపుల్లో లభ్యం అవుతాయి. ఉసిరి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి సహాయపడటమే కాకుండా తెల్ల జుట్టును తగ్గిస్తుంది. కలోంజీ విత్తనాలలో ఉన్న పోషకాలు జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.