Healthhealth tips in telugu

Heart problems:గుండె జబ్బులను దూరం చేసే బెస్ట్ మసాలా దినుసులు ఇవే

Heart problems:గుండె జబ్బులను దూరం చేసే బెస్ట్ మసాలా దినుసులు ఇవే.. ఒకప్పుడు 60 సంవత్సరాలు దాటాక గుండెకు సంబంధించిన సమస్యలు వస్తూ ఉండేవి కానీ ప్రస్తుతం మారిన జీవన శైలి కారణంగా చాలా చిన్న వయసులోనే గుండెకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి.

అధిక రక్తపోటు మారిన ఆహారపు అలవాట్లు ధూమపానం డయాబెటిస్ వంటి రకరకాల కారణాలతో గుండె సమస్యలు వస్తున్నాయి ఈ సమస్యలను నివారించటానికి కొన్ని మసాలా దినుసులను తీసుకుంటే మంచిది. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

వాము
వాము లో ఉండే పొటాషియం,క్యాల్షియం గుండె సమస్యలను తగ్గిస్తుంది. వామును రెగ్యులర్ డైట్ లో తీసుకుంటే అధిక రక్తపోటు అదుపులో ఉండి గుండెకు సంబంధించిన సమస్యలు రావు.
Diabetes tips in telugu
లవంగం
ఘాటుగా ఉండే లవంగాలు రక్తపోటు అదుపులో ఉండేలా చేసి గుండె సమస్యలను తగ్గిస్తుంది. ప్రతి రోజు ఒక లవంగం తీసుకుంటే చాలా మంచిది

మిరియాలు
మిరియాలను ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ను తొలగిపోయి గుండెకు సంబంధించిన సమస్యలు రావు.
Weight Loss Drink In Telugu Dalchina Chekka
దాల్చిన చెక్క
మంచి రుచి వాసన కలిగిన దాల్చినచెక్క లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి దీనిలో యాంటీఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి గుండె జబ్బుల నుండి రక్షిస్తుంది

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.