Kitchenvantalu

Rats:ఇంటిలో ఎలుకలతో ఇబ్బంది పడుతున్నారా…ఈ టిప్స్ పాటిస్తే..

Rats:ఇంటిలో ఎలుకలతో ఇబ్బంది పడుతున్నారా…ఈ టిప్స్ పాటిస్తే.. దాదాపుగా ప్రతి ఇంటిలోనూ ఎప్పుడో ఒక అప్పుడు ఎలుకల బాధ ఉంటుంది. ఎలుకలు వచ్చాయంటే నానా రభస చేసేస్తూ ఉంటాయి. ఇంటిలో మూలాన నక్కి ఉంటాయి. ఇంటిలో ఎలుక చనిపోయినా అది ఎక్కడ ఉందో వెతకటం కూడా అంత సులభం కాదు.

ఎలుక చనిపోయినప్పుడు వచ్చిన వాసనకు కడుపులోని పేగులు బయటకు రావడం ఖాయం. కాబట్టి ఎలుకలను ఇంటి నుంచి బయటకు తరిమి కొట్టే చిట్కాలను తెలుసుకుందాం.

ఎలుకలకు లవంగాల వాసన పడదు. అందువల్ల కొన్ని లవంగాలను ఒక వస్త్రంలో వేసి మూట కట్టి ఎలుకలు తిరిగే ప్రాంతాలలో పెడితే ఆ వాసనకు ఎలుకలు బయటకు పారిపోతాయి.

పెప్పర్‌మింట్ ఆయిల్‌ లో ముంచిన దూది బాల్స్ ని ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో పెడితే ఆ వాసనకు ఎలుకలు బయటకు పారిపోతాయి.

మనం ప్రతి రోజు వంటలలో కారం వాడతాము కదా… ఆ కారం పొడిని ఒక వస్త్రంలో వేసి మూట కట్టి ఎలుకలు తిరిగే ప్రదేశంలో పెడితే ఎలుకలు పారిపోతాయి.

ఉల్లి వాసన కూడా ఎలుకలకు పడదు. ఉల్లిపాయ ముక్కలను గదికి నాలుగు మూలాల పెడితే ఆ వాసనకు ఎలుకలు రావు. 2 రోజులకు ఒకసారి ఉల్లిపాయ ముక్కలను మార్చాలి.

మార్కెట్లో ఎలుకల మందు దొరుకుతుంది. పెస్ట్ కంట్రోల్ మందులు కూడా స్ప్రే చేయవచ్చు. ఐతే ఇవన్నీ హానికారక రసాయనాలు. వాటితో మన ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదముంది.

అదే ఇంట్లో దొరికే సహజసిద్ధమై పదార్థాలతో ఎలుకలను తరిమి కొడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ఈ చిట్కాలను పాటించి ఎలుకలను ఇంటి నుంచి తరిమికొట్టండి.