Healthhealth tips in telugu

Summer Juice:యాపిల్+నేరేడు కలిపి జ్యూస్ తాగితే శరీరంలో ఏమి అవుతుందో తెలుసా?

Summer Juice:యాపిల్+నేరేడు కలిపి జ్యూస్ తాగితే శరీరంలో ఏమి అవుతుందో తెలుసా.. వేసవిలో కొన్ని రకాల జ్యూస్ లను తాగితే వేసవిలో వచ్చే అలసట, నీరసం, నిస్సత్తువ వంటి వారిని తగ్గించుకోవచ్చు. ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వడదెబ్బ తగలకుండా చూసుకోవాలి. ప్రస్తుతం నేరేడు పండ్లు చాలా విరివిగా లభిస్తున్నాయి. నేరేడు,యాపిల్ తో ఒక జ్యూస్ తయారీ చూద్దాం.

మిక్సీ జార్ లో ఒక కప్పు గింజలు తీసిన నేరేడు పండ్లు, ఒక కప్పు యాపిల్ ముక్కలు,అంగుళం అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి మెత్తగా చేయాలి. మెత్తగా అయ్యాక ఒక కప్పు నీరు,అరచెక్క నిమ్మరసం వేసి మరోసారి మిక్సీ చేసి వడగట్టకుండా గ్లాస్ లో పోయాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల తేనె,చిటికెడు చాట్ మసాలా, పావు స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసి బాగా కలపాలి.

దీనిలో చల్లదనం కోసం 5 ఐస్‌క్యూబ్స్‌ వేస్తే చల్ల చల్లని యాపిల్ నేరేడు జ్యూస్ రెడీ. ఈ జ్యూస్ లో ఉండే ఫైబర్, విటమిన్‌ సి, విటమిన్‌ ఏ ఇంకా ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, గ్లూకోజ్, ప్రోటిన్‌ వంటి పోషకాలు మన శరీరానికి అందుతాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్‌ ఫ్రీ ర్యాడికల్స్‌తో పోరాటం చేసి సెల్ డ్యామేజ్ ని నియంత్రిస్తాయి.

తక్కువ కేలరీలు ఉండే ఈ జ్యూస్ వేసవిలో బరువు తగ్గాలని అనుకొనేవారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఎందుకంటే వేసవిలో వచ్చే నీరసం, అలసట లేకుండా చేస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా వేసవిలో వచ్చే జీర్ణ సమస్యలు లేకుండా చేస్తుంది. నోటి ఆరోగ్యాన్ని కూడా కాపాడటంలో సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.