Beauty Tips

Clove Oil For Hair:లవంగ నూనెను ఇలా వాడితే…జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు

Clove Oil For Hair:లవంగ నూనెను ఇలా వాడితే…జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు.. మారిన జీవనశైలి, ఒత్తిడి,జుట్టు పట్ల సరైన పోషణ లేకపోవటం వంటి కారణాలతో జుట్టుకి సంబందించిన సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఈ సమస్యలను తగ్గించుకోవటానికి లవంగ నూనె చాలా బాగా సహాయపడుతుంది.

జుట్టు డ్యామేజ్‌ని అరికట్టి రిపేరు చేయటానికి సహాయపడుతుంది. జుట్టు సంరక్షణలో Clove Oil చాలా అద్భుతంగా పనిచేస్తుంది. Clove Oil లోయూజినాల్ అనే రసాయనం ఉంటుంది. ఈ రసాయనంలో యూజీనాల్ శక్తివంతమైన యాంటీమైక్రోబయల్, యాంటిసెప్టిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.

అంతేకాకుండా పొటాషియం, సోడియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఐరన్, మాంగనీస్, విటమిన్లు కె మరియు సి, అయోడిన్ మరియు ఫైబర్ వంటి జుట్టు పెరుగుదలకు అవసరమైన అనేక పోషకాలు సమృద్దిగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉండుట వలన ఆక్సీకరణ నష్టం నుండి జుట్టును రక్షించడంలో సహాయపడతాయి.

అందువల్ల అనేక షాంపూలు మరియు హెయిర్ సీరమ్‌లలో లవంగ నూనెను విరివిగా ఉపయోగిస్తున్నారు. లవంగం నూనెలో యూజినాల్ ఉండుట వలన తలకు రాసినప్పుడు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. తల మీద రక్తప్రసరణను పెంచుతుంది. అయితే లవంగ నూనెను ఎలా వాడాలో తెలుసుకుందాం.

ఒక బౌల్ లో రెండు స్పూన్ల పెరుగు,అరస్పూన్ ఆముదం, 5 చుక్కల లవంగాల నూనెను కలిపి పేస్ట్ లాగా తయారు చేసి జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ విధంగా చేయటం వలన జుట్టు రాలటం తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.

లవంగం నూనెను వాడటానికి ముందు ప్యాచ్ టెస్ట్ చేయాలి. మీ కళ్ళలో లవంగం నూనె పడకుండా జాగ్రత్త పడాలి. కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే జుట్టుకి సంబందించిన సమస్యలు తొలగిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.