Beauty Tips

White Hair Turn Black:తెల్ల జుట్టును నల్లగా మార్చే మామిడి ఆకులు..ఇలా వాడితే సరిపోతుంది

White Hair Turn Black:తెల్ల జుట్టును నల్లగా మార్చే మామిడి ఆకులు..ఇలా వాడితే సరిపోతుంది.. ఈ మధ్య కాలంలో ఎంతో మంది తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి మామిడి ఆకులు చాలా బాగా సహాయపడతాయి. మామిడి ఆకులను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. మామిడి ఆకులలో ఎవరూ ఊహించని ప్రయోజనాలు ఉన్నాయి.

మామిడి ఆకులు కూడా చాలా సులభంగా లభ్యం అవుతాయి. జుట్టికి సంబందించిన సమస్యలను తగ్గించటానికి మామిడి ఆకులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మామిడి ఆకులను శుభ్రంగా కడిగి ఎండలో పెట్టి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ఒకసారి చేసుకుంటే చాలా రోజుల వరకు వాడవచ్చు.

పొయ్యి వెలిగించి పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి కాస్త వేడి అయ్యాక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee Powder ), వన్ టేబుల్ స్పూన్ టీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ఎండిన ఉసిరికాయ ముక్కలు వేసి పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

ఈ నీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ప్పుడు ఐరన్ కడాయి తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు మామిడి ఆకుల పొడి, మూడు టేబుల్ స్పూన్లు హెన్నా పొడి( Henna Powder ) వేసి,ముందుగా తయారుచేసి పెట్టుకున్న నీటిని పోసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ఒక గంట పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే ఆమంచి పలితం వస్తుంది.

ఈ చిట్కా జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయ్యి తెల్లజుట్టు సమస్య నుండి బయటపడటానికి ప్రయత్నం చేయండి. కాస్త ఓపికగా చిట్కాలను ఫాలో అయితే మంచి పలితం వస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.