Healthhealth tips in telugu

Sleeping:మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పడుకుంటున్నారా…అయితే ఇది మీకోసమే

Sleeping:మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పడుకుంటున్నారా…అయితే ఇది మీకోసమే.. మధ్యాహ్నం భోజనం అయ్యాక కాస్త కునుకు తీస్తున్నారు. కొంతమంది మధ్యాహ్నం భోజనం అయ్యాక ఒక కునుకు తీస్తే చాలా మంచిది అని భావిస్తారు.

భోజనం కాగానే నిద్ర రావడం సహజమే.అయితే నిపుణులు ఇలా మధ్యాహ్నం భోజనం అయ్యాక పడుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. భోజనం అయ్యాక పడుకున్నప్పుడు కడుపులోనుంచి జీర్ణ రసాలు గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఆహారం వైపు వస్తాయి.

దాంతో ఆమ్ల స్వభావం కారణంగా గొంతు మంట ఏర్పడుతుంది. కాబట్టి భోజనం చేసిన వెంటనే పడుకోకూడదు. అంతేకాకుండా భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల తీసుకున్న ఆహారం మొత్తం జీర్ణాశయం మీద ఒత్తిడి తెస్తుంది.

దాంతో గురక కూడా వస్తుంది. కాబట్టి భోజనం అయ్యాక ఒక గంట తర్వాత పడుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు. భోజనం చేసిన వెంటనే పడుకుంటే హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది. కాబట్టి భోజనం అయ్యాక కనీసం అరగంట గ్యాప్ ఇచ్చి పడుకోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."