Beauty Tips

Hair Care Tips:రెండు స్పూన్ల పంచదారతో జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు

Hair Care Tips:రెండు స్పూన్ల పంచదారతో జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు… జుట్టుకి సంబందించిన సమస్యలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. ఆ సమస్యలు రాకుండా ఉండాలన్నా…వచ్చిన సమస్యలు తగ్గాలన్నా ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. కాస్త శ్రద్ద,సమయం కేటాయిస్తే సరిపోతుంది.

ఈ చిట్కా కోసం పంచదార ఉపయోగిస్తున్నాం. టీ,కాఫీ తాగమంటే ఖచ్చితంగా పంచదార వేసుకుంటాం. అలాగే పంచదార ఎక్కువగా తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే పంచదార జుట్టు సంరక్షణలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

ఒక బౌల్ లో రెండు స్పూన్ల పంచదార, రెండు స్పూన్ల కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. పంచదార మెల్ట్ అయిన తర్వాత రెగ్యలర్ గా వాడే షాంపూ నాలుగు స్పూన్లు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత రెండు గ్లాసులు గోరువెచ్చని నీటిని పోసి బాగా కలపాలి.

ఈ నీటితో తలస్నానం చేయాలి. ఈ విధంగా 15 రోజులకు ఒకసారి తలస్నానం చేస్తే జుట్టు ఎంత డ్రై గా ఉన్నా సరే స్మూత్ గా మరియు సిల్కీగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.

స్కాల్ప్ పై పేరుకు పోయిన డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.తేమ పెరుగుతుంది.జుట్టు చిట్లడం విరగడం వంటివి కూడా తొలగిపోతాయి. జుట్టు సమస్యలకు మంచి పరిష్కారం అని చెప్పవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.