Beauty Tips

Sunscreen Lotion:సన్‌స్క్రీన్ లోషన్ రోజులో ఎన్నిసార్లు అప్లై చేయాలో తెలుసా…?

Sunscreen Lotion:సన్‌స్క్రీన్ లోషన్ రోజులో ఎన్నిసార్లు అప్లై చేయాలో తెలుసా… సన్‌స్క్రీన్ లోషన్ వాడటం అనేది చాలా మంచిది. అయితే సన్‌స్క్రీన్ లోషన్ వాడినప్పుడు మనలో చాలా సందేహాలు ఉంటాయి. రోజులో ఎన్ని సార్లు రాయవచ్చు…దాని వల్ల లాభాలు ఏమిటో తెలుసుకుందాం.

సన్ స్క్రీన్ కేవలం మన చర్మాన్ని రక్షించటమే కాకుండా మన చర్మానికి చాలా ముఖ్యమైనది. కఠినమైన యూఏవిఏ లేదా బి కిరణాల నుంచి రక్షణ కోసం Sunscreen Lotion వాడుతూ ఉంటాం. Sunscreen Lotion ని మనలో చాలా మంది బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే రాస్తూ ఉంటారు.

అయితే Sunscreen Lotion ని రెండు గంటలకు ఒకసారి రాస్తే మంచిదని నిపుణులు అంటున్నారు. సన్ స్క్రీన్ లోషన్ రాయడం వల్ల చర్మం పై ముడతలు సన్నని గీతలు తగ్గడమే కాకుండా చర్మం యవ్వనంగా కనబడుతుంది.

సన్ స్క్రీన్ లోషన్ రాయడం వల్ల చర్మానికి కొల్లజిన్, కెరటిన్ వంటి పోషకాలు అందుతాయి. అంతేకాకుండా దుమ్ము ధూళి మురికి వంటి వాటి నుండి చర్మాన్ని రక్షించే చర్మం ప్రకాశవంతంగా కాంతివంతంగా మెరుస్తుంది. అయితే చర్మతత్వానికి సెట్ అయ్యే సన్ స్క్రీన్ లోషన్ ఎంపిక చేసుకోవాలి.

సన్ స్క్రీన్ లోషన్ ని ఇంటిలో ఉన్నప్పుడు కూడా రాయాలి. చాలా మంది కేవలం బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే రాస్తూ ఉంటారు. అలా కాకుండా నిపుణులు చెప్పిన విధంగా ఫాలో అయితే చర్మానికి మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.