Healthhealth tips in telugu

Diabetic diet:షుగర్ ఉన్నవారు పిస్తా పప్పు తింటే… ముఖ్యంగా వేసవిలో …

Diabetic diet:షుగర్ ఉన్నవారు పిస్తా పప్పు తింటే… ముఖ్యంగా వేసవిలో … పిస్తా పప్పులో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కాలంలో డయాబెటిస్ ఉన్నవారికి పిస్తా పప్పు ఒక వరం అని చెప్పవచ్చు. డయాబెటిస్ ఉన్నప్పుడు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే తీసుకొనే ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఇప్పుడు డయాబెటిస్ ఉన్నవారు పిస్తా పప్పు తింటే ఏమి జరుగుతుందో చూద్దాం.

డయాబెటిస్ ఉన్నవారు మోనో శాచ్యురేటెడ్ కొవ్వులు ఎక్కువగా, సంతృప్త కొవ్వులు తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఈ ఆహారం తీసుకుంటే గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణ, కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవడం వలన 27శాతం కంట్రోల్ లో ఉంటుంది.
Diabetes diet in telugu
పిస్తా పప్పును తీసుకోమని డయాబెటిస్ నిపుణులు కూడా సిఫార్సు చేస్తున్నారు. పిస్తా పప్పులో అసంతృప్త కొవ్వులు, మెగ్నీషియం, సెలీనియం, విటమిన్లు, ఫినోలిక్ సమ్మేళనాలు, ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన డయాబెటిక్ నిర్వహణలో చాలా బాగా సహాయపడుతుంది. ఇన్సులిన్ ఇన్సెన్సిటివిటీని మెరుగుపరచడానికి, ప్యాంక్రియాటిక్ కణాలు ఆక్సీకరణం నష్టం లేకుండా రక్షించటానికి సహాయపడుతుంది.
cholesterol reduce foods
యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్న ఆహారాలలో పిస్తా పప్పు ఉంటుంది. పిస్తా పప్పులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే గ్లైసెమిక్ సూచిక చాలా తక్కువగా ఉంటుంది. పిస్తాపప్పులో ఇతర డ్రై ఫ్రూట్స్ తో పోల్చినప్పుడు మోనో మరియు పాలీ అన్సాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన కొలెస్ట్రాల్ తగ్గించడానికి మరియు గుండెకు సంబంధించిన సమస్యలు లేకుండా చేస్తుంది.

డయాబెటిస్ ఉన్న వారిలో కొలెస్ట్రాల్ మరియు గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది . కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు రోజుకి 4 నుంచి 6 సాల్టు లేని పిస్తాపప్పులను తినవచ్చు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరు సైతం చురుగ్గా పనిచేస్తుంది. ఎముకలు దృఢంగా మారతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.