Healthhealth tips in telugu

Protein Laddu:కేవలం 1 లడ్డు తింటే… కీళ్లనొప్పులు, అలసట, నీరసం, రక్తహీనత అనేవి ఉండవు

Protein Laddu;కేవలం 1 లడ్డు తింటే… కీళ్లనొప్పులు, అలసట, నీరసం, రక్తహీనత అనేవి ఉండవు.. మారిన జీవనశైలి కారణంగా ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలను ఆహారంలో మార్పులు చేసుకుంటూ తగ్గించుకోవచ్చు. పప్పుధాన్యాలలో మినుములకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మినప్పప్పుతో ఇడ్లీ, దోస, వడ అలా చేసుకుంటూ ఉంటాం.
Black gram Health benefits in telugu
అలా కాకుండా మినప్పప్పును వేగించి పొడి తయారు చేసుకొని దానిలో బెల్లం, నెయ్యి వేసి లడ్డు తయారు చేసుకుని రోజుకి ఒకటి తింటూ ఉంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. జీవక్రియ రేటును మెరుగుపరిచే జీర్ణసంబంధ సమస్యలు అయినా గ్యాస్., కడుపు ఉబ్బరం, కడుపులో మంట వంటి సమస్యలు లేకుండా చేస్తుంది.
Joint Pains
నీరసం, అలసట, నిస్సత్తువ లేకుండా తక్షణ శక్తిని అందిస్తుంది. పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా, బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేసి కీళ్ల నొప్పులు లేకుండా చేస్తుంది. మినుములలో ఉండే సూక్ష్మ పోషకాలు ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తుంది.ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తనాళాలు ధమనుల్లో ఏర్పడే ఒత్తిడిని తగ్గించి రక్తప్రసరణను మెరుగుపరిచి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. మినుముల్లో రెండు రకాల పీచుపదార్థాలు ఉంటాయి. వీటిల్లో ఉండే కరిగే ఫైబర్ ఆహారం నుంచి శరీరం పోషకాలను గ్రహించడానికి సహాయ పడుతుంది.

కరగని ఫైబర్ తీసుకున్న ఆహారం సక్రమంగా అరిగేలా చేస్తుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తూ అనారోగ్యాలకు దూరంగా ఉంచుతాయి. ఇందులో ఉండే మెగ్నిషియం, కాల్షియం, పొటాషియం తలనొప్పిని తగ్గిస్తాయి. కాబట్టి కాస్త ఓపిక చేసుకొని ఈ లడ్డును తయారుచేసుకొని రోజులో ఒకసారి తింటే మంచి ప్రయోజనం ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.