Beauty Tips

Almond Oil For Face:బాదం ఆయిల్ లో వీటిని కలిపి రాస్తే మెరిసే ముఖం మీ సొంతం..

Almond Oil For Face:బాదం ఆయిల్ లో వీటిని కలిపి రాస్తే మెరిసే ముఖం మీ సొంతం.. ఈ మధ్య కాలంలో ఆడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందం మీద శ్రద్ద పెడుతున్నారు. దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా సులభంగా మెరిసే ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు.

బాదం నూనె గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాదం పప్పు నుండి తయారయ్యే ఈ నూనెలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ ఈ, విటమిన్ డి మరియు యాంటి ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. బాదం నూనె ఎన్నో చర్మ ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఈ నూనెను ఎలా ఉపయోస్తే ఎలాంటి చర్మ సమస్యలు తొలగి పోతాయో తెలుసుకుందాం.

ఒక స్పూన్ బాదం నూనెలో ఒక స్పూన్ పాలు వేసి బాగా కలిపి ముఖానికి రాసి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంటయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముడతలు అన్ని తొలగిపోతాయి. చర్మం మృదువుగా మారుతుంది. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఒక స్పూన్ బాదం నూనెలో ఒక స్పూన్ గ్రీన్ టీ వేసి బాగా కలిపి మొఖానికి పట్టించి అరగంటయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలు, నల్లని మచ్చలు అన్ని తొలగిపోతాయి. అంతేకాకుండా మృతకణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.