Beauty Tips

White Hair Turn Black: తెల్ల జుట్టు నల్లగా మారాలంటే..రంగు అవసరం లేదు ..

White Hair Turn Black: తెల్ల జుట్టు నల్లగా మారాలంటే..రంగు అవసరం లేదు .. వయస్సుతో సంబంధం లేకుండా అన్నివయసులో వారిలోనూ తెల్లజుట్టు సమస్య కనిపిస్తుంది. ఒక్క సారి జుట్టు తెల్లబడటం ప్రారంభం అయితే తల అంతటిలోనూ కనిపిస్తుంది. దీంతో కాస్త ఒత్తిడికి లోను అవుతూ ఉంటారు. జుట్టును నల్లగా మార్చటానికి మార్కెట్ లో ఎన్నో రకాల ఉత్పత్తులు ఉంటాయి.

వాటిని వాడితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశలు ఉన్నాయి. అందువల్ల మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. తెల్లజుట్టు సమస్య రావటానికి అనేక కారణాలు ఉంటాయి.

ముఖ్యంగా వెంట్రుకల్లో పోషకాలు లోపించడం, కెమికల్స్ ఎక్కువగా ఉన్న ప్రొడక్ట్స్ వాడటం , జుట్టుకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఒత్తిడి వంటి కారణాలతో చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది. ఈ సమస్యకు పరిష్కారం మన వంటింటిలో ఉండే మెంతులు బాగా సహాయపడతాయి.

మెంతి గింజలలో ఐరన్, ప్రొటీన్లు ఉండుట వలన జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. అలాగే పొటాషియం సమృద్దిగా ఉండుట వలన తెల్లజుట్టు రాకుండా చేయటమే కాకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతాయి.

మెంతులను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం మెత్తని పేస్ట్ గా చేసి జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి గంట అయ్యాక తేలికపాటి షాంపూ తో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.

మెంతి గింజలను గ్రైండ్ చేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. మూడు స్పూన్ల పొడిలో ఒక నిమ్మకాయ రసాన్ని పిండాలి. కొంచెం నీటిని పోసి పేస్ట్ గా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ని జుట్టు మూలాల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ విధంగా 15 రోజులకు ఒకసారి చేస్తే  మంచి పలితం ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.