Beauty Tips

Remedies to control hair fall: ఈ చిట్కా ఫాలో అయితే.. జుట్టు రాలడం తగ్గుతుంది

Remedies to control hair fall: ఈ చిట్కా ఫాలో అయితే.. జుట్టు రాలడం తగ్గుతుంది.. వాతావరణంలో కాలుష్యం, ఒత్తిడి, జుట్టుకి సరైన పోషణ చేయకపోవటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టుకి సంబందించిన అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. సమస్యలు రాగానే మనలో చాలా మంది కంగారు పడిపోయి వేలకొద్ది డబ్భును ఖర్చు పెట్టి మేకేట్ లో దొరికే ప్రొడక్ట్స్ వైపు అడుగులు వేస్తారు.
hair fall tips in telugu
అలా కాకుండా ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు సమస్యలు తగ్గుతాయి. జుట్టుకు సంబంధించిన సమస్యలు హెయిర్ ఫాల్, చుండ్రు, తెల్ల జుట్టు వంటివి ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమస్యలు స్త్రీలనే కాకుండా పురుషులను కూడా వేధిస్తున్నాయి. ఈ సమస్యలు రాగానే మనలో చాలామంది మార్కెట్లో దొరికే ఖరీదైన షాంపూలు, హెయిర్ ఆయిల్ వాడుతూ ఉంటారు.
Green Tea Brain Health Benefits
అయినా పెద్దగా ఫలితం కనబడక చాలా నిరాశకు గురి అవుతూ ఉంటారు. అలాకాకుండా ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాను ఫాలో అయితే చాలా సులభంగా చాలా తక్కువ ఖర్చుతో జుట్టు రాలే సమస్యను, తెల్లజుట్టు,చుండ్రును సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాను చాలా సులభంగా చేసుకోవచ్చు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోయాలి. నీరు కాస్త వేడయ్యాక రెండు స్పూన్ల టీ పొడి వేసి బాగా మరిగించి డికాషన్ వడగట్టాలి. రెండు స్పూన్ల బియ్యాన్ని కడిగి నీటిని పోసి నానబెట్టాలి. ఆ తర్వాత ఒక కలబంద ఆకును శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఒక మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు, నాలుగు మందార పువ్వులు వేసి మెత్తని పేస్ట్ గా మిక్సీ చేయాలి.
Hair fall Tips in telugu
ఆ తర్వాత ఆ మిశ్రమంను ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో నాలుగు టీ స్పూన్ల టి డికాషన్, 4 స్పూన్ల బియ్యం నీరు, అర స్పూన్ ఆముదం వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి గంట అయ్యాక కుంకుడు కాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది.
amudam
అలాగే తెల్ల జుట్టు కూడా తొందరగా వచ్చే అవకాశాలు తగ్గుతాయి. చుండ్రు సమస్య, తలలో దురద వంటివి కూడా తొలగిపోతాయి. చుండ్రు సమస్య ఉందంటే జుట్టు రాలే సమస్య కూడా చాలా ఎక్కువ అవుతుంది. కాస్త ఓపికగా చేసుకుంటే ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.