HealthKitchenvantalu

Summer Juice: వేసవిలో పుదీనా, నిమ్మకాయ వాటర్ తాగితే.. ఎంత మంచిదో తెలుసా ?

Summer Juice: వేసవిలో పుదీనా, నిమ్మకాయ వాటర్ తాగితే.. ఎంత మంచిదో తెలుసా.. వేసవికాలంలో ఇంటిలో తయారుచేసుకున్న జ్యూస్ లను తాగితే మంచిది. పుదీనాలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

కావలసిన పదార్థాలు:
పుదీనా – ఒక కట్ట
జీలకర్ర పొడి – ఒక టీ స్పూను
సోంపు పొడి- ఒక టీ స్పూను
వాము పొడి – అర టీ స్పూను
మిరియాల పొడి – ఒక టీ స్పూను
నిమ్మకాయ రసం – రెండు చెక్కలు
ఉప్పు – తగినంత
నీళ్లు – ఒక లీటరు

తయారుచేసే విధానం
ముందుగా పుదీనా ఆకుల్ని శుభ్రంగా కడిగి వాటిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ ముద్దను నీటిలో కలిపి అందులో జీలకర్ర పొడి, సోంపు పొడి, వాము పొడి, మిరియాల పొడి, నిమ్మకాయ రసం, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన రసాన్ని కుండలో పోసుకుని మనకి అవసరం అయినప్పుడు త్రాగితే చాలా బాగుంటుంది.