Healthhealth tips in telugu

Kokum:ఈ పండు తింటే ఎన్ని లాభాలో.. అనేక వ్యాధులు దూరం.. !

kokum Health Benefits In Telugu : కొకుమ్‌ (kokum) ని ఎప్పుడైనా తిన్నారా…వీటిలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలో కొవ్వును కరిగించటానికి సహాయపడి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దాంతో తీసుకున్న ఆహారం కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది.
Kokum
అలాగే ఎసిడిటీ,గ్యాస్,మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. శరీర బరువును త్వరగా తగ్గించడంలో సహాయపడుతుంది. Kokum లో ఉండే హైడ్రాక్సిల్ యాసిడ్ తినాలనే కోరికను తగ్గించి ఆకలిని తగ్గిస్తుంది. హైడ్రాక్సిల్ యాసిడ్ కొవ్వును కరిగించటమే కాకుండా బరువు తగ్గించటంలో కూడా బాగా సహాయపడుతుంది.
Weight Loss tips in telugu
కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. కొవ్వు ఆమ్లాలను సంశ్లేషణ చేయడంలో సహాయపడి కొవ్వును కరిగించి బయటకు పంపుతుంది. విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన ఇన్ఫెక్షన్ కలిగించే కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.
Immunity foods
ఇది కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. Kokum లో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ-వైరల్ లక్షణాలు ఉండుట వలన శరీరంలో అనేక రకాల బ్యాక్టీరియా మరియు వైరల్ ఇన్ఫెక్షన్‌లను నివారించటంలో సహాయపడుతుంది. దీనిలో అద్భుతమైన యాంటీ డయాబెటిక్ లక్షణాలు,యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి.
Diabetes diet in telugu
అందువల్ల శరీరంలో ఇన్సులిన్ స్రావాన్ని పెంచుతుంది, తద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా చేస్తుంది. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. మెగ్నీషియం, పొటాషియం మరియు మాంగనీస్ వంటి ఖనిజాలు ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో సహాయపడి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
saraswati Plant
Kokum లో ఫ్లేవనాయిడ్స్, హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్, గార్సినోల్ మరియు ఆంథోసైనిన్‌లు ఉంటాయి. ఇవన్నీ మెదడులో సెరోటోనిన్ స్థాయిలను పెంచడానికి దోహదం చేస్తాయి. దాంతో ఆందోళన, ఒత్తిడి మరియు నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది. మెదడును చురుకుగా ఉంచడానికి పనిచేసి మతిమరుపు సమస్యలు లేకుండా చేస్తుంది.
Kokum Dry
Kokum అనేది పండు రూపంలో దొరుకుతుంది…అలాగే డ్రై రూపంలో కూడా దొరుకుతుంది. ఈ పండు పుల్లని రుచిని కలిగి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో పులుపు కోసం కూరల్లో ఈ పండును వాడతారు. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్న Kokum పండును తినటానికి ప్రయత్నం చేయండి. మార్కెట్ లో జ్యూస్ రూపంలో కూడా లభ్యం అవుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.