Kitchen

Get Rid Of Termites: చెదపురుగులు ఇబ్బంది పెడుతున్నాయా..ఇలా చేస్తే సులభంగా తరిమికొట్టవచ్చు

Termites Remove Tips: చెదపురుగులు అనేవి వేసవికాలంలో ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. చెక్క వస్తువులను ఎక్కువగా నాశనం చేస్తూ ఉంటాయి. చెద పురుగుల నుంచి బయటపడటానికి మనం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం.

చెద పురుగుల నుండి బయటపడటానికి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం. నిమ్మ నారింజ వంటి సిట్రస్ పండ్ల నుండి వచ్చే వాసన చీమలు, చెదపురుగులను నివారించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి.

ఈ పండ్ల రసాన్ని పిండి నీటితో కలిపి చెద పురుగులపై లేదా చెదలపై స్ప్రే చేస్తే చెదపురుగులను నివారిస్తుంది. వెనిగర్ నీటిలో కలిపి స్ప్రే చేస్తే వెనిగర్ నుంచి వచ్చే బలమైన వాసన కీటకాలను నాశనం చేస్తుంది.

వెల్లుల్లి వాసన కూడా చెదపురుగులు, చీమలు, దోమలు వంటి క్రిమి కీటకాలను నాశనం చేయడంలో సమర్ధవంతంగా పని చేస్తుంది. వెల్లుల్లిని మెత్తని పేస్ట్ గా చేసి నీటిలో కలిపి చెద పురుగుల మీద జల్లితే సరిపోతుంది.

దాల్చిన చెక్క కూడా చెద పురుగులను తొలగించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. దాల్చిన చెక్క బలమైన వాసన చీమలు,చెద పురుగులను నివారిస్తుంది.