Beauty Tips

Yellow Teeth:ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఎంతటి పసుపు రంగు పళ్ళు అయినా తెల్లగా మెరుస్తాయి

Yellow Teeth Tips : పళ్ళు తెల్లగా మెరుస్తూ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలా కోరుకోవటం సహజమే. కొంతమందికి పళ్లను ఎంత శుభ్రంగా ఉంచుకున్న పంటి మీద గార,పసుపు రంగులోకి మారతాయి. అలాంటి వారు ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు.

మన ఇంటిలో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి గార లేకుండా పళ్లను తెల్లగా మార్చుకోవచ్చు. దీని కోసం ముందుగా క్యారెట్ ని కోరుకొని జ్యూస్ తీయాలి. ఒక బౌల్ లో రెండు స్పూన్ల క్యారెట్ జ్యూస్,పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ రెగ్యులర్ గా వాడే టూత్ పేస్ట్ వేసి బాగా కలిపి బ్రష్ సాయంతో పళ్లను బ్రష్ చేయాలి.

ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే పళ్ళు తెల్లగా మెరవటమే కాకుండా ఆరోగ్యంగా ఉంటాయి. క్యారెట్ లో విటమిన్ k సమృద్దిగా ఉండుట వలన దంతాల మీద ఎనామిల్ ని రక్షించటమే కాకుండా పళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

అలాగే పంటి మీద గార,పసుపు రంగును తొలగిస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్, యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలు నోటిలోని బ్యాక్టీరియాను నాశనం చేయటమే కాకుండా పళ్ళను తెల్లగా మారుస్తుంది.

ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలాగే ఈ చిట్కా ఫాలో అయితే పసుపు రంగు దంతాలు తెల్లగా మారటమే కాకుండా పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.