Beauty Tips

Hair Fall:ఈ గింజలతో ఇలా చేస్తే చుండ్రు లేకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటం ఖాయం

Sabja Hair Fall tips : ఈ రోజుల్లో మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో బాధపడు తున్నారు. జుట్టు రాలే సమస్య రాగానే అసలు కంగారూ పడకుండా ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది.

చాలా తక్కువ ఖర్చులో జుట్టు రాలకుండా చేసుకోవచ్చు. ఈ చిట్కా కోసం సబ్జా గింజలను ఉపయోగిస్తున్నాం. సబ్జా గింజలు వేసవిలో అలసట,నీరసం తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. సబ్జా గింజలు జుట్టు సంరక్షణలో సహాయపడుతుందని మనలో చాలా మందికి తెలియదు.

ఒక స్పూన్ సబ్జా గింజలను నీటిలో రెండు గంటల పాటు నానబెట్టాలి. కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి నీటిని పోసి మిక్సీ చేసి పాలను తయారుచేయాలి. మిక్సీ జార్ లో నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజలు, ఒక చిన్న ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయాలి.

ఆ తరువాత కొబ్బరి పాలను పోసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకొని ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలిపి జుట్టుకి పట్టించి అరగంట అలా వదిలేయలి.

అరగంట అయ్యాక రెగ్యులర్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటమే కాకుండా చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.