MoviesTollywood news in telugu

Tollywood:టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ సెలబ్రెటీస్…గుర్తు పట్టారా…?

Ram Charan And Sushmita Childhood Photos :సెలబ్రిటీలు,ప్రముఖులు సోషల్ మీడియాలో ఉండడంతో ఎప్పటికప్పుడు విషయాలు పంచుకోవడంతో పాటు రకరకాల ఫోటోలు షేర్ చేస్తున్నారు. సెలబ్రిటీల ఫోటోలు కావడంతో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇద్దరు పిల్లల పిక్స్ వైరల్ గా మారాయి.

ఇవి చూస్తే వీళ్ళను ఎక్కడో చూసినట్టు ఉందని అనుకోవడం సహజం. దీంతో పలువురు సెర్చ్ చేయడంతో టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ పాపులర్ సెలబ్రెటీస్ అని తేలింది. వీరిద్దరు ఒక స్టార్ హీరో పిల్లలు. పైగా అందులో ఒకడు ఇప్పుడు స్టార్ హీరో.

అవును, స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ముద్దుల పిల్లలు అయిన రామ్ చరణ్, సుష్మిత.ఇంతకీ ఫోటోను ప్రస్తుతం ఆచార్య సినిమా కోసం కూడా ఆమె కాస్ట్యూమ్స్ డిజైనర్ గా వర్క్ చేస్తున్న సుష్మిత తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ, గుర్తు పట్టండి అంటూ కామెంట్ తో ఫజిల్ వదిలింది.

సుష్మిత కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ బిజీగా గడుపుతూ, తన తండ్రి తమ్మడు నటిస్తున్న సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలకు కూడా ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ డిజైనర్ గా వ్యవహరిస్తోంది.

సినిమా ఇండస్ట్రీలో ఆమె తనవంతు పాత్రను పోషిస్తున్న సుష్మిత ఖైదీ నెం.150 నుండి మొదలుకుని కాస్ట్యూమ్స్ డిజైనర్ గా తన సినీ ప్రస్థానంను కంటిన్యూ చేస్తోంది. సైరా సినిమాలో ఆమె చక్కటి ప్రతిభ కనబర్చి పాత్రలకు తగ్గట్లుగా చక్కని కాస్ట్యూమ్స్ ను డిజైన్ చేసింది.

షూటింగ్ లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటే ఎప్పటికప్పుడు తండ్రిని చూసుకుంటూ ఉన్న సుష్మిత సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పోస్ట్ లు పెడుతూ తన వృతిపరంగా,వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తోంది.