Kitchenvantalu

Besan Halwa Recipe: స్వీట్ తినాలనిపిస్తే ఇలా 10 నిమిషాల్లో చేసేయండి.. చాలా ఈజీగా..

Besan Halwa: హల్వా అంటే అందరికి తెలిసిన స్వీట్.కాని శనగ పిండితో చేసే బేసిన్ హల్వా ఎప్పుడైనా ట్రై చేసారా.

కావాల్సిన పదార్ధాలు
శనగపిండి – 1 కప్పు
నెయ్యి – ¾ -1 కప్పు
పంచదార – ½ కప్
బొంబాయ్ రవ్వ – 2 టేబుల్ స్పూన్స్
వేడి నీళ్లు – 1 కప్పు
ఆరెంజ్ ఫుడ్ కలర్ – 1 టేబుల్ స్పూన్
యాలకులు పొడి – ¼ టేబుల్ స్పూన్
బాదం పలుకులు – ½ కప్పు

తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నెయ్యి కరిగించి శనగపిండి వేసి మీడియం ఫ్లేమ్ పై కలుపుతు వేపుకోవాలి.
2.వేగుతున్న పిండి లో రవ్వ ఇంకో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి కలుపుతూ వేపుకోవాలి.
3.శనగపిండి వేగిన తర్వాత పంచదార వేసి వేడి వేడి నీళ్లు వేసి దగ్గర పడేవరకు కలుపుతూ ఉడికించుకోవాలి.
4.హల్వా దగ్గర పడ్డాక ఫుడ్ కలర్,మిగిలిన నెయ్యి ,యాలకుల పొడి,బాదం పలుకులు వేసి నెయ్యి పైకి తేలేవరకు కలుపుతూ వేపుకోవాలి.
5.హల్వా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే బేసిన్ హల్వా రెడీ.