Beauty Tips

White Hair To Black Hair: తెల్ల వెంట్రుకలు రావడం ప్రారంభం అయ్యాయా.. వర్రీ వద్దు..

White Hair To Black Hair: తెల్ల జుట్టు సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కంగారు పడిపోతూ ఉంటారు. అలాగే బయటకు వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. తెల్ల జుట్టు రాగానే మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వైపు అడుగులు వేస్తారు.

అయితే ఎక్కువగా రసాయనాలు ఉండే ప్రొడక్ట్స్ వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటి జోలికి వెళ్ళకుండా మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

ఇప్పుడు చెప్పే ప్యాక్ లో ఉసిరి,మెంతులు ఉపయోగిస్తున్నాము. ఈ రెండు కూడా ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉసిరిలో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన జుట్టులో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. మెంతులలో ఉండే అమైనో ఆమ్లాలు తెల్లజుట్టును నివారిస్తాయి.

పొయ్యి వెలిగించి పాన్ పెట్టి 5 స్పూన్ల ఆలివ్ oil వేసి వేడి చేసి…ఆ తర్వాత ఒక స్పూన్ ఉసిరి పొడి, ఒక స్పూన్ మెంతుల పొడి వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.

ఈ నూనెను రాత్రి సమయంలో జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించి మరుసటి రోజు ఉదయం తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.