Kitchenvantalu

Oats Idli Recipe:ఓట్స్ తో రుచికరమైన ఇడ్లి చేసుకోండిలా.. రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యం కూడా..

Oats Idli:ఓట్స్ ఇడ్లీ..డైట్ చేస్తున్నవాల్లు ఓట్స్ ఎక్కువ తీసుకుంటారు.డైట్ చేస్తునే ఓట్స్ తో ఇడ్లీ చేసుకుంటే ఓట్స్ ని ఇంకాస్తా ఇష్టంగా తీసుకోవచ్చు. ఓట్స్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
ఓట్స్ – 1 కప్పు
బొంబాయి రవ్వ – ½ కప్పు
పెరుగు – ½ కప్పు
క్యారేట్ ముక్కలు – ½ కప్పు
ఉప్పు – 1 టీ స్పూన్
బేకింగ్ సోడా – చిటికెడు
ఆవాలు – ½ టీ స్పూన్
జీలకర్ర – ½ టీ స్పూన్
మినపప్పు – 1 టీ స్పూన్
శనగపప్పు – 1 టీ స్పూన్
పచ్చిమిర్చి – 2
కొత్తిమీర – ½ కప్పు
అల్లం – చిన్న ముక్క
కరివేపాకు – ½ కప్పు

తయారీ విధానం
1.ముందుగా ఓట్స్ ని కప్పు వరకు పౌడర్ గా గ్రైండ్ చేసుకోవాలి.
2.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి అందులోకి ఆవాలు,జీలకర్ర,శనగపప్పు,మినపప్పు,వేసి వేపుకోవాలి.
3.ఇప్పుడు అందులోకి అల్లం తరుగు,కరివేపాకు,పచ్చిమిర్చి ముక్కలు,రవ్వను వేసి ఐదునిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
4.ఇప్పుడు అందులోకి ఓట్స్ పౌడర్ ని వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
5.మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సింగ్ బౌల్ లోకి పెరుగు,ఉడికించిన పల్లీలు,క్యారేట్ ,కొత్తిమీర వేసి కలుపుకోవాలి.

6.కొద్ది కొద్దిగా నీళ్లను వేసి బ్యాటర్ ని ఇడ్లీ కన్ సిస్టెన్సీ లో కలుపుకోవాలి.
7.పదినిమిషాల పాటు బ్యాటర్ ని నాననివ్వాలి.
8.ఇడ్లీ ప్లేట్స్ కి ఆయిల్ అప్లై చేసి అవసరం అనకుంటే బేకింగ్ సోడాని బ్యాటర్ లో కలుపుకోని ఇడ్లీ ప్లేట్స్ లోకి ఇడ్లీ లను ఫిల్ చేసుకోవాలి.
9.ఇడ్లి పాత్రలని గిన్నెలో పెట్టుకోని మూత పెట్టి పది నుంచి పన్నెండు నిమిషాలు వరకు ఉడికించుకోవాలి.
10.అంతే ఓట్స్ ఇడ్లీ రెడీ అయినట్టే.