Kitchen

Beans Tomato Curry Recipe:కమ్మటి రుచితో బీన్స్ కూర ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు.. సూపర్ గా ఉంటుంది

Beans Tomato Curry:బీన్స్ లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బీన్స్ తో ఎప్పుడు ఒకేలా కర్రీ చేసుకుంటే బోర్ కొడుతుంది. అలా కాకుండా టమోటాతో కలిపి చేస్తే మంచి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చపాతీ,roti,అన్నం వంటి వాటిలో చాలా బాగుంటుంది. ఈ కర్రీకి కావలసిన పదార్ధాలు, తయారి విధానం చూద్దాం.

కావలసిన పదార్ధాలు
బీన్స్ 250 గ్రాములు
మూడు టమాటాలు
ఒక ఎండుమిర్చి
ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేయాలి
ఒక పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేయాలి
5 కరివేపాకు రెబ్బలు
ఒక స్పూన్ నూనె
ఒక స్పూన్ పసుపు
ఒక స్పూన్ ఆవాలు
ఒక స్పూను మినప్పప్పు
ఒక స్పూన్ కారం
ఒక స్పూను జీలకర్ర పొడి
ఒక స్పూన్ ధనియాల పొడి
ఒక స్పూను తెల్ల నువ్వుల పొడి
ఒక స్పూను బెల్లం
కొత్తిమీర

తయారీ విధానం
బీన్స్ శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి కుక్కర్ లో పెట్టి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఉల్లిపాయ మెత్తబడే వరకు వేగించాలి. ఆ తర్వాత ఉడికించిన బీన్స్ ముక్కలు వేసి రెండు నిమిషాలు అయ్యాక కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.

ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. టమోటా మెత్తపడిన తర్వాత ఉప్పు, తెల్ల నువ్వుల పొడి, బెల్లం వేసి బాగా కలిపి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి, చివరగా కొత్తిమీర వేసి కలిపి పొయ్యి మీద నుంచి దించేయాలి. అంతే Beans Tomato Curry రెడీ.