Kitchenvantalu

Jonna Soup Recipe:బరువు తగ్గాలనుకునే వారికి, డయబెటిస్ ఉన్నవారికి Healthy Breakfast..

Jonna Soup:జొన్నలతో వెజ్ సూప్.. రుచికరమైన ,ఆరోగ్యకరమైనా ధాన్యాలలో ఒకటి జొన్న. అంబలి చేసినా,గట్క చేసినా ,సూప్ చేసినా రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. జొన్నలతో వెజ్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
జొన్న పిండి – 3-4 టేబుల్ స్పూన్స్
కొర్రలు – 2 టేబుల్ స్పూన్స్
వెజిటెబుల్స్ – నచ్చినవి
మిరియాల పొడి – రుచికి సరిపడా
పచ్చిమిర్చి – 2
ఉప్పు – తగినంత
కొత్తిమీర – చిన్న కట్ట

తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని అందులోకి కరిగించిన నెయ్యిని వేడి చేసి అందులోకి జీలకర్ర,పచ్చిమర్చి తరుగు,క్యారెట్,క్యాప్సికం,బీన్స్,పచ్చిబఠానీ లను వేసి వేపుకోవాలి.
2.ఇందులోకి కొర్రలు,బంగాళదుంపలను కూడ వేసి ,తగినంత ఉప్పు వేసి మూత పెట్టుకోని రెండు,మూడు నిమిషాలు ఉడికించాలి.
3.అందులోకి మూడు కప్పుల నీళ్లను పోసి మరిగించు కోవాలి.

4.వేరొక గిన్నెలో జొన్న పిండి వేసి ½ కప్పు నీళ్లతో జారుగా కలుపుకోవాలి.
5.మరుగుతున్న నీళ్లలో మరో గ్లాస్ నీళ్లను కలుపుకోవాలి.
6. ఇప్పుడు కలిపి పెట్టుకున్న జొన్న పిండి మిశ్రమాన్ని వేసి బాగా మరిగించాలి.
7.మరుగుతున్న సూప్ లో పెప్పర్ పౌడర్ ,కొత్తిమీర వేసి కలుపుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
8.అంతే వేడి వేడి జొన్న పిండి వెజిటెబుల్ సూప్ రెడీ.