Beauty Tips

Face Glow Tips:వాల్ నట్స్ ఇలా వాడితే ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మెరుస్తుంది

Walnuts For Face: ముఖం అందంగా తెల్లగా మెరవాలంటే బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మన ఇంటిలో దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి ముఖాన్ని కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు.

వాల్ నట్స్ అంటే మనలో చాలామందికి ఆరోగ్య ప్రయోజనాల గురించి మాత్రమే తెలుసు. కానీ వాల్ నట్స్ లో బ్యూటీ ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. వాల్ నట్స్ లో మెగ్నీషియం, జింక్, పాస్పరస్, మాంగనీస్, సెలీనియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, పోలిక్ యాసిడ్, విటమిన్ బి, విటమిన్ ఇ వంటివి సమృద్ధిగా ఉంటాయి.

చలికాలం వచ్చేసింది. చర్మం పొడిగా మారిపోతుంది. చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండాలంటే వాల్ నట్స్ ని పొడిగా చేసుకుని ఆ పొడిలో తేనె కలిపి ముఖానికి రాసి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి పావుగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం తేమగా మారి మృదువుగా యవ్వనంగా ఉంటుంది.

నల్లని మచ్చలు, మొటిమలు పోవాలంటే వాల్ నట్స్ తో ఈ ప్యాక్ తయారు చేసుకోవాలి. వాల్ నట్స్ పొడిలో రోజ్ వాటర్, నిమ్మరసం కలిపి ముఖానికి రాసి అరగంటయ్యాక గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఈ ప్యాక్ ని వారంలో రెండు సార్లు వేసుకుంటే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.