MoviesTollywood news in telugu

Rowdy Inspector:రౌడీ ఇనస్పెక్టర్ సినిమా వెనక ఎన్ని నమ్మలేని నిజాలు ఉన్నాయో….చూస్తే షాక్ అవుతారు

Rowdy Inspector Movie:లారీ డ్రైవర్ మూవీ తర్వాత నందమూరి బాలకృష్ణకు ఎక్కడలేని మాస్ క్రేజ్ వచ్చింది. బాలయ్య, బి గోపాల్ కాంబినేషన్ అదిరిపోయింది. దాంతో నిర్మాత టి త్రివిక్రమరావు ఓ మూవీ ప్లాన్ చేసారు. అప్పుడే తమిళంలో చిన్నతంబి అనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో బాలయ్యతో చేద్దామని పరుచూరి బ్రదర్స్ సూచించి,ఒకే అంటే రీమేక్ రైట్స్ తీసుకోవాలని భావించారు.

కానీ బాలయ్యకు నచ్చకపోవడంతో రాజేంద్రప్రసాద్ దగ్గరకు వెళ్లి అటునుంచి వెంకటేష్ కి వెళ్లడంతో చంటిగా రూపుదిద్దుకుంది. దాంతో కొండవీటి సింహం స్పూర్తితో లారీ డ్రైవర్ రైటర్ కృష్ణానంద్ ఓ స్టోరీ రాసి విన్పించడంతో పరుచూరి బ్రదర్స్ కి నచ్చేసింది. బి గోపాల్ ఓకే. బాలయ్య కూడా రెడీ.

దాంతో లారీ డ్రైవర్ టీమ్ ని పెట్టారు. విజయశాంతి హీరోయిన్. బప్పీల హరిని మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టారు. ఇనస్పెక్టర్ పాత్ర కోసం ట్రైనింగ్ తీసుకుని,1991జూన్ 10న బాలయ్య పుట్టినరోజున షూటింగ్ స్టార్ట్.ఊటీ, చెన్నె,హైదరాబాద్ ,తదితర చోట్ల షూటింగ్ చేసారు. అయితే అదే సమయంలో ధర్మక్షేత్రం షూటింగ్ కూడా ఉండడంతో అవే మీసాలు మెలేసి రౌడీ ఇనస్పెక్టర్ లో పెట్టగా, ధర్మక్షేత్రంలో మీసాలు కిందికి దించి ఉంటాయి.

ముందుగా ధర్మక్షేత్రం పూర్తయింది. మరోపక్క మోహన్ బాబు తో బి గోపాల్ బ్రహ్మ మూవీ కూడా పూర్తి చేయడంతో 1992ఫిబ్రవరి నుంచి రౌడీ ఇనస్పెక్టర్ మూవీ షూటింగ్ శరవేగంగా సాగింది. దీనికి బడ్జెట్ రెండున్నరకోట్లు. ఏప్రియల్ లో ఆడియో రిలీజ్. బప్పీల హరి సంగీతం సూపర్ హిట్. మే7న రిలీజయింది. తొలిరోజే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో బాలయ్య నటన అదిరింది. 10ఫైట్స్ సీన్స్ కి తగ్గట్టు ఉంటా యి. బాలయ్య ఎంట్రీ, విజయశాంతి ఎంట్రీ,రౌడీలా పరిచయ సన్నివేశాలు సూపర్భ్ . సంగీతం , పవర్ ఫుల్ డైలాగులు ,అందరి నటన, బి గోపాల్ డైరెక్షన్ వెరసి సినిమాకు మంచి ఓపెనింగ్స్ తేవడమే కాదు, ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. కామెడీ సీన్స్ నవ్విస్తాయి. బొబ్బర్లంక రామ బ్రహ్మం గా విలన్ నటన కూడా ఆకట్టుకుంది.

86ప్రింట్స్ తో 196థియేటర్లలో రిలీజైన ఈ మూవీ తొలివారం కోటి 40లక్షల షేర్ కలెక్ట్ చేసింది. 50రోజులకు 4కోట్ల 12లక్షలు,35సెంటర్స్ లో వందరోజులు ఆడిన ఈ మూవీ 9కోట్ల షేర్ కలెక్ట్ చేసి, ఘరానా మొగుడు,చంటి తర్వాత ఆల్ టైం 3మూవీగా నిల్చింది. రాయలసీమలో నెంబర్ వన్ మార్కెట్ తెచ్చింది. తమిళం,హిందీలలో డబ్బింగ్ అయిన ఈ మూవీ రెండు చోట్లా సూపర్ హిట్ అయింది. తెలుగు,తమిళ,హిందీలో 175డేస్ ఆడిన సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది.