MoviesTollywood news in telugu

Mayabazar Movie:మాయా బజార్ సినిమా గురించి ఈ నిజాలు మీకు తెలుసా…

Mayabazar Movie:విజయా వాళ్ళు తీసిన మాయా బజార్ మూవీ 50ఏళ్ళు దాటినా ఇంకా ఆడియన్స్ మదిలో శాశ్వతమే. షావుకారు,పెళ్లిచేసి చూడు, చంద్రహారం, పాతాళభైరవి తర్వాత మాయాబజార్ విజయ బ్యానర్ లో వచ్చింది. తర్వాత శశిరేఖా పరిణయం చేయాలనీ నిర్ణయం. కెవి రెడ్డి డైరెక్షన్ లో తీయాలని ప్లాన్. కానీ భారీ తారాగణం,బడ్జెట్ కారణంగా ఆపేసారు.

దీంతో విజయా వాళ్ళు తీయకపోతే తాము తీస్తామని ఏవిఎం వాళ్ళు కబురు చేసారు. అయితే ఎంతిచ్చినా ఇంకొకరికి తీసేది లేదని కెవి రెడ్డి తేల్చిచెప్పేశారు. మరో ఇద్దరి నుంచి కూడా కబురు వచ్చినా ఇదే మాట. మొత్తానికి నాగిరెడ్డి ,చక్రపాణిలకు విషయం తెల్సి, సినిమాకు బడ్జెట్ ఎంతవుతుందని అడగడంతో కెవిరెడ్డి లెక్కగట్టి పంపడంతో సినిమా కు గ్రీన్ సిగ్నల్ పడింది.

ఏకకాలంలో తెలుగు తమిళ వెర్షన్స్ లో షూటింగ్. ఎన్టీఆర్, అక్కినేని,ఎస్వీఆర్,రేలంగి వంటి స్టార్స్ తప్ప తమిళంలో వేరే,తెలుగులో వేరే యాక్టర్స్. ముందుగా తెలుగు వెర్షన్ స్టార్ట్. అయితే నాలుగు పాటలకు సాలూరి రాజేశ్వరరావు బాణీలు కట్టాక ఎందుకో ఆయన తప్పుకోవడంతో ఘంటసాల మిగిలిన సాంగ్స్ కి బాణీలు కట్టి,పద్యాలూ,ఇతర నేపధ్యానికి ఘంటసాల సంగీతం అందించారు.

ఘటోత్కచుని పాత్రను హైలెట్ చేస్తూ సినిమా తీస్తున్నానని,డేట్స్ ఇవ్వాలని ఎన్టీఆర్ ని కెవిరెడ్డ్డి అడిగితె రాక్షస పాత్ర బాగోదేమో అనడంతో కృష్ణ పాత్ర కోసం పిలచానని చెప్పారు. తనచేత కృష్ణ పాత్ర చేయించి నష్టపోవద్దని ఎన్టీఆర్ అనేసారు. అయినా పట్టుబట్టడంతో అగ్రిమెంట్ మీద ఎన్టీఆర్ సంతకం చేసారు.

కృష్ణుడి గెటప్ కోసం ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ ఎన్టీఆర్, కెవిరెడ్డి రూపొందించుకున్నారు. కృష్ణుని గెటప్ లో ఎన్టీఆర్ ని చూసిన నాగిరెడ్డి ,చక్రపాణి ఆశ్చర్యపోయారు. సినిమా రిలీజ్ తర్వాత జనంలో ఎన్టీఆర్ బాగా పాపులర్ అయ్యారు.నిజానికి ఈలపాట రఘురామయ్యను కృష్ణ పాత్రకోసం అనుకున్నారు.

ఎన్టీఆర్ ని అభిమన్యుడి పాత్రకోసం అనుకున్నారట. కానీ రఘురామయ్య డేట్స్ కుదరకపోవడంతో సీన్ మారింది. బలరామకృష్ణులు,శశిరేఖ తదితరులు కూర్చున్న షాట్ ని ప్రొఫైల్ గా తీయించారు. రేలంగి సాంగ్ సుందరీ ఓ సుందరీ పాటను పిఠాపురం నాగేశ్వరరావు తో పాడించి డబ్బులు కూడా ఇచ్చి పంపించేసాక, ఘంటసాలను ఓసారి పాడమని చక్రపాణి అడగడం,ఘంటసాల పడడంతో ఇదే ఉంచేయమని చెప్పారట.

ఇక శశిరేఖా పరిణయం కన్నా మాయాబజార్ టైటిల్ బాగుందని ఖరారు చేసారు. బజార్ అనేది తెలుగు మాట కాదు. ఎక్కడా సినిమాలో బజార్ అనేమాట రాకుండా జాగ్రత్త పడ్డారు. 1957 మార్చి లో ఈ సినిమా తెలుగులో విడుదల కాగా , 15రోజుల తర్వాత ఏప్రియల్ 12న తమిళంలో రిలీజయింది.

కెమెరామెన్ మార్కస్ బార్లే పనితనం ఎంతచెప్పినా తక్కువే. లాహిరి లాహిరి లాహిరి సాంగ్ లో వెన్నెలను తెరకెక్కించిన దృశ్యం జనానికి బాగా కనెక్ట్ అయింది. పైగా మూడు జంటల మీద తీసిన పాట కావడంతో ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టింది. రధాన్ని తోలుతూ పాడే భళీ భళీ సాంగ్ మాధవపెద్ది సత్యం పాడారు.

ఇక సుశీల పాడిన అహనా పెళ్లి అంట పాటలో తాదామ్ ధీమ్ తొమ్ అని మాధవపెద్ది పాడారని అందరూ అనుకుంటున్నారు. కానీ ఘంటసాలే పాడారు. వివాహ భోజనంబు పాటలో అన్నీ ఆరగించడం కెమెరామెన్ సృష్టించిన మాయాజాలమే.

డైరెక్టర్ కెవి రెడ్డి,రచయిత పింగళి నాగేంద్రరావు ఈ సినిమా ఆధ్యంతం హాస్య వినోద భరితంగా నడిపించారు. అందుకే మాయాబజార్ ఎప్పటికీ మాయాబజారే. మాయాబజార్ మూవీ జంధ్యాలకు పంచ ప్రాణాలు. వివాహ భోజనంబు, ఆహా నా పెళ్లంట, చూపులు కల్సిన శుభవేళ, వంటి పల్లవులతోనే తన సినిమాలకు టైటిల్స్ పెట్టారు.