Movies

Venkatesh‘ప్రేమించుకుందాం రా’ సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో…?

Preminchukundam raa Movie :కొన్ని సినిమాలు తరం మారితే పెద్దగా ఆకట్టుకోవు .. కానీ కొన్ని ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉంటాయి. అందులో విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ప్రేమించుకుందాం.. రా సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై డి.సురేష్ బాబు నిర్మించారు.
Venkatesh
మూవీ మొఘల్ డి.రామానాయుడు సమర్పకుడిగా వ్యవహరించారు. ప్రేమించుకుందాం.. రా సినిమా మే 9తో 23 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. జయంత్. సి. పరాన్జీ ఈ సినిమాతో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమయ్యాడు. అలాగే ఈ సినిమాతో అంజలా ఝవేరి హీరోయిన్‌గా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. మాములు ప్రేమకథకు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో దర్శకుడు జయంత్ సి.పరాన్జీ తెరకెక్కించి ఈ చిత్రాన్ని సూపర్ హిట్‌ చేసాడు.

ఓ మాములు మధ్యతరగతి కుర్రాడు.. రాయలసీమలోని ఓ ఫ్యాక్షన్ కూతురిని ప్రేమిస్తాడు. ఈ సందర్భంగా ఈ ఫ్యాక్షనిస్ట్ వాళ్ల కుటుంబాన్ని ఏ విధంగా హింసల పాలు చేస్తాడు,.చివరకు హీరో తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడనేదే ఈ సినిమా ఇతివృత్తం. మొత్తం మీద ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో తెలుగులో తెరకెక్కిన తొలి చిత్రంగా ‘ప్రేమించుకుందాం రా’ సినిమా రికార్డులకు ఎక్కింది ఆ తర్వాత మోహన్ బాబు ..శ్రీరాములయ్య’ సినిమా కూడా ఫ్యాక్షన్ స్టోరీ. కానీ ఇది పరిటాల రవి తండ్రి శ్రీరాములయ్య జీవిత కథకు కొంచెం కాల్పనిక కథ జోడించి తెరకెక్కించారు.

ఇక ఆ తర్వాత బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సమర సింహారెడ్డి’ సినిమా అసలు సిసలు ఫ్యాక్షన్ సినిమా గా నిల్చింది. అందులో హీరో, విలన్ ఇద్దరు ఫ్యాక్షన్ లీడర్లు కావడం గమనార్హం. ఇక ప్రేమించుకుందాం రా సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా అప్పటి వరకు వచ్చిన ప్రేమకథల్లో ట్రెండ్ సెట్టర్‌ అయింది. ముఖ్యంగా హీరో వెంకటేష్, అంజలా ఝవేరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేసాయి. ఇక ఈ చిత్రానికి మహేష్ అందించిన సంగీతం, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్రాణం పోశాయని చెప్పాలి.