MoviesTollywood news in telugu

Tollywood:అలనాటి నటి తులసి పెళ్లి ఎంత విచిత్రంగా జరిగిందో తెలిస్తే షాక్

Telugu actress tulasi shivamani :సినిమా స్టార్స్ పెళ్లిళ్లు అలా జరిగి ఇలా విడిపోతున్న ఘటనలు ఈమధ్య ఎక్కువగా చూస్తున్నామ్. కానీ కొందరు మాత్రం తమ ప్రేమ పెళ్ళిళ్ళను పదికాలాలపాటు పదిలపరచుకుంటున్నారు. ఇక ఉదయం ప్రేమలోపడి సాయంత్రం పెళ్ళాడి, మంచి దాంపత్య జీవితం పొందుతున్న ఒక నటి గురించి తెల్సుకుందాం.

ఆమె ఎవరో కాదు చాలా సినిమాల్లో అమ్మ, అక్క, వదిన, చెల్లెలు, తదితర పాత్రలో నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తులసి తెలుగులో తులసి సెల్వమణి దాదాపుగా సీనియర్ నుంచి జూనియర్ వరకు అందరి స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది.

ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రలో చక్కగా ఒదిగిపోతూ సెంటిమెంటల్ సన్నివేశాలను పండించే తులసిని తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. ఈసందర్బంగా తులసి సెల్వమణి తన పెళ్లి విషయం ప్రస్తావించి ఆడియన్స్ ని ఆశ్చర్యంలో పడేసింది. అప్పట్లో కన్నడ భాషలో “మదర్ ఇండియా” అనే చిత్రంలో నటించే ఛాన్స్ రావడంతో చెన్నై కి వెళ్లానని అప్పుడు దర్శకుడు సెల్వమణి ని షూటింగ్ లో కలుసుకున్నానని వివరించింది.

సెల్వమణి చూడడం అదే మొదటి సారి అయినప్పటికీ చూడగానే తనలో ప్రేమ లాంటి భావన కలిగిందని చెప్పింది. అయితే ప్రేమ ప్రపోజ్ చేసింది మాత్రం సెల్వమణి కావడం విశేషమని చెప్పుకొచ్చింది. షూటింగ్ పూర్తయ్యాక ఇద్దరూ దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నామని తెలిపింది.

ఇదంతా కేవలం ఒక్క రోజులోనే జరిగిపోయిందంటూ చెప్పి, అందరినీ షాకయ్యేలా చేసింది.ఇక తన భర్తకు మొదట్లో సిగరెట్ కాల్చే అలవాటు ఎక్కువ ఉండేదని, అయితే తనకు పొగ ఎలర్జీ వల్ల బాధపడుతున్నానని తెలుసుకుని సిగరెట్ కాల్చడం మానేశాడని చెప్పుకొచ్చింది.