Kitchen

Kitchen Hacks:ఇలా చేస్తే నల్లగా మాడిపోయిన స్టీల్ గిన్నెలు తళతళా మెరిసిపోతాయి

Remove black stains from steel utensils:మనం వంటింట్లో ప్రతి రోజు వంట చేసే సమయంలో గిన్నెలు మాడిపోతూ ఉంటాయి. స్టీల్ గిన్నెలను ప్రతిరోజు వాడటం వలన మెరుపు తగ్గిపోయి నల్లగా మారుతూ ఉంటాయి. ఇలా నల్లగా మారిన మరియు మాడిపోయిన గిన్నెలను శుభ్రం చేయటానికి ఇప్పుడు చెప్పే చిట్కాలు సహాయపడతాయి.
lemon benefits
పూర్వం అల్యూమినియం పాత్రలు, మట్టి కుండల్లో వంటలను చేసేవారు. కానీ ప్రస్తుతం స్టీలు పాత్రలలో వంటలను ఎక్కువగా చేస్తున్నారు. గిన్నెలో బాగా నల్ల బడిన లేదా మాడిన భాగంపై కాస్త నిమ్మరసం వేసి రుద్ది… కొంచెం సేపయ్యాక శుభ్రం చేయాలి. నిమ్మకాయలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు మొండి మరకలు, జిడ్డు, నూనె మరకలను తొలగించడానికి సహాయపడుతుంది.

మొండి మరకలను, జిడ్డును తొలగించడానికి బేకింగ్ సోడా కూడా బాగా సహాయపడుతుంది. నల్లగా మరియు మాడిన గిన్నెలో నీటిని పోసి కొంచెం బేకింగ్ సోడా వేసి వేడి చేయాలి. ఆ తర్వాత ఆ నీరు కాస్త వేడి తగ్గాక రుద్దితే జిడ్డు, మురికి, నలుపు అన్ని తొలగిపోతాయి.