Healthhealth tips in telugu

Health Tips: ఒంట్లో కొలస్ట్రాల్‌ పెరిగిందా.. వీటిని డైట్‌లో చేర్చుకోండి..!

Cholesterol reduce Foods In Telugu : ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. మారిన జీవన శైలి పరిస్థితుల కారణంగా మనలో చాలా మంది చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు.ఈ సమస్య నుంచి బయట పడటానికి మన ఇంట్లో ఉండే కొన్ని మసాలా దినుసులు చాలా బాగా సహాయపడుతాయి. మసాలా దినుసులలో ఉండే ఔషధ గుణాలు కొలెస్ట్రాల్ నియంత్రించడానికి సహాయపడతాయి.

పసుపులో యాంటి ఆక్సిడెంట్స్, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీరు లేదా ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసి బాగా కలిపి తాగితే సరిపోతుంది.

నల్లమిరియాలు కూడా కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా .పని చేస్తాయి. నల్లమిరియాలలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. పావు స్పూన్ లో సగం మిరియాల పొడిని ప్రతిరోజు ఏదో ఒక రూపంలో అంటే టిఫిన్ చేసే సమయంలో టిఫిన్ మీద జల్లుకొని లేదా పాలల్లో కలుపుకొని తీసుకోవచ్చు.

దాల్చిన చెక్కలో ఉండే యాంటి మైక్రోబియల్, యాంటీఆక్సిడెంట్స్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలందించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. దాల్చిన చెక్క పొడిని గోరువెచ్చని పాలలో కలుపుకుని తాగవచ్చు లేదా దాల్చిన చెక్క పొడిని తేనెలో కలుపుకొని తీసుకోవచ్చు.

చెడు కొలెస్ట్రాల్ తొలగించడానికి రక్తప్రసరణ బాగా జరగడానికి ధనియాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. .ధనియాలను కషాయంగా తయారు చేసుకుని తీసుకుంటే సరిపోతుంది. లేదా ధనియాలను పొడిగా చేసుకొని కూరల్లో వేసుకోవచ్చు.

లవంగాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కొలెస్ట్రాల్ కరిగించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. రోజుకు ఒక లవంగం నమిలి ఆ రసాన్ని మింగితే సరిపోతుంది. గోరువెచ్చని పాలలో చిటికెడు లవంగాల పొడి కలుపుకుని తాగవచ్చు.

మెంతుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజు అరస్పూన్ మెంతులను నానబెట్టి తింటే కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తుంది. మెంతులను వేగించి పొడిగా తయారుచేసుకొని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ పొడిని కలిపి తీసుకున్న పర్వాలేదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.