Healthhealth tips in telugu

High blood pressure :హైబీపీతో బాధపడేవారు ఈ పండ్లను తింటే జీవితంలో అధిక రక్తపోటు అనేది ఉండదు

high blood pressure : ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా చాలా చిన్న వయస్సులోనే రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. రక్తపోటు సమస్య ఒక్కసారి వచ్చిందంటే తప్పనిసరిగా జీవితకాలం మందులు వాడవలసిందే.

అలా మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే పండ్లను తీసుకుంటూ ఉంటే రక్తపోటు నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది.సిట్రస్ పండ్లలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా కిడ్నీలో అదనంగా ఉన్న నీటిని సోడియంను బయటకు పంపటానికి సహాయపడుతుంది.

రక్తనాళాల గోడలను సడలించి రక్తపోటును తగ్గిస్తుంది. సిట్రస్ పండ్లలో ఉండే naringin అనే బయో ఫ్లవనాయిడ్ ఆక్సీకరణ ఒత్తిడి తగ్గిస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది.

అవకాడోలో మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తనాళాల గోడలను సడలించి రక్త ప్రవాహం బాగా సాగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అవకాడోలో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి, విటమిన్ ఇ మరియు విటమిన్ ఎ,మోనోశాచురేటెడ్ కొవ్వు గుండెను ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడతాయి.

అప్రికాట్స్ లో ఉండే డైటరీ ఫైబర్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఫ్లేవనాయిడ్స్ గుండెకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది . విటమిన్ సి అనేది కొల్లాజెన్‌ను నిర్మించడంలో సహాయపడుతుంది. కొల్లాజెన్ రక్తనాళాల గోడలో భాగం, మన శరీరం తగినంతగా ఉత్పత్తి చేయకపోతే, ధమనులు గట్టిపడతాయి. ధమనులు సరైన రీతిలో వ్యాకోచం లేకపోతే రక్తపోటు పెరుగుదలకు దారితీస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.