Joints:ఎముకలు పెళుసుగా లేకుండా బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే..
Joint Pains Food : ఈ మధ్యకాలంలో మహిళల్లో వయసు పెరిగే కొద్దీ ఆస్ట్రియా ఫ్లోరోసిస్ వంటి ఎముకలకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. ఒకప్పుడు 60 సంవత్సరాలకు వచ్చే ఈ సమస్యలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 30 సంవత్సరాలు దాటేసరికి వచ్చేస్తున్నాయి. ఈ సమస్యల తీవ్రత తగ్గించు కోవడానికి మరియు ఈ సమస్యలు రాకుండా ఉండటానికి కొన్ని ఆహారాలను రెగ్యులర్ గా తీసుకోవాలి.
పాలకూరలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి ఆర్థరైటిస్ వల్ల కలిగే మంటను తగ్గించడంలో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన వాపు నుండి ఉపశమనం కలిగిస్తుంది. పాలకూరలో యాంటీఆక్సిడెంట్ కెంప్ఫెరోల్ ఎక్కువగా ఉంటుంది, ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో సంబంధం ఉన్న ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ల ప్రభావాలను తగ్గిస్తుంది. పాలకూరలో ఉండే కాల్షియం మన రోజువారీ అవసరాలకు సరిపోతుంది.
వాల్ నట్స్ లో ఉండే సమ్మేళనాలు, పోషకాలు కీళ్ల వ్యాధికి సంబంధించిన వాపును తగ్గించడంలో సహాయపడతాయి. వాల్‌నట్స్‌లో ముఖ్యంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గిస్తాయి. చాలా మంది వాల్ నట్స్ అంటే మెదడు ఆరోగ్యానికి సహాయపడతాయని భావిస్తారు.
పెరుగు కూడా ఎముకలు పెళుసుగా మారకుండా సహాయపడుతుంది. కొవ్వు లేని పాలతో తయారుచేసిన పెరుగులో 30 శాతం కాల్షియం, కొంత మేరకు విటమిన్ డి ఉంటుంది.ఇవి ఎముకలు పెళుసుగా మారకుండా బలంగా ఉండటానికి సహాయపడతాయి. మనలో చాలా మంది పెరుగు తినటానికి ఆసక్తి చూపరు. కానీ 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ పెరుగు తినటం అలవాటు చేసుకోవాలి.
అల్లం కూడా నొప్పులను తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అల్లంలో ఉన్న పోషకాలు ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించడానికి సహాయ పడతాయి. అల్లంలో ఉండే సమ్మేళనాలు శరీరంలో వాపును ప్రోత్సహించే పదార్థాల ఉత్పత్తిని నిరోదిస్తాయి. అల్లంను ప్రతి రోజు ఆహారంలో బాగంగా చేసుకుంటే మంట,నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.